Harsha sai responds on police case :
యూట్యూబర్ హర్ష సాయి పై ( Harsha sai responds on police case ) నమోదు అయిన రేప్ కేసు గురించి అందరికీ తెల్సిందే. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ రేప్ కేసు ను హర్ష సాయి పై నమోదు చేసింది. వీళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా తేయబోతున్నారు. ఇప్పుడు తనే రేప్ కేసు నమోదు చేయడం తో అందరు షాక్ అయ్యారు. న్యూడ్ వీడియో లు మరియు ఫొటోస్ తో హర్ష సాయి తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి నార్సింగి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసింది. యువతి హర్ష సాయి పై నే కేసు నమోదు చేయడమే కాకుండా హర్ష సాయి తండ్రి పై రాధాకృష్ణ పై కూడా కేసు నమోదు చేసింది. హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలా సార్లు రేప్ చేశాడని యువతి పేర్కొంది. అయితే చివరకు ఈ కేసు పై హర్ష సాయి నోరు విప్పాడు.
హర్ష సాయి ఇన్స్తగ్రాం ( Harsha sai responds on police case in Instagram ) వేదికగా రెస్పాండ్ అయ్యాడు. యువతి చేసింది అన్ని తప్పుడు ఆరోపణలు అని, డబ్బు కోసమే తను ఇలా చేస్తుంది అని అన్నాడు. అంతేకాకుండా తను చేసిన ఆరోపణలు అన్ని అబద్ధాలు అని త్వరలో నే తెలుస్తాయని, మా లాయర్ చిరంజీవి త్వరలోనే మీ ముందుకు వస్తారు అని హర్ష సాయి అన్నారు. ప్రస్తుతం పోలీసులు హర్ష సాయి మరియు తన తండ్రి కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ మొబైల్ ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ చేసి ఉన్నాయి.
హర్ష సాయి యూట్యూబ్ లో మంచి ఎంత చేస్తాడో చెడు కూడా అంతే చేస్తున్నాడు అని పలువురు ఆరోపించారు. ఎందుకంటే హర్ష సాయి తన యూట్యూబ్ ఛానెల్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటాడు. వీటి వల్ల వచ్చిన డబ్బులను కొంత పేదలకు ఇస్తాడు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్య కూడా చేసుకున్నారు.