Harsha Sai :
ఫేమస్ యూట్యూబ్ స్టార్ హర్ష సాయి పై ( rape case on Harsha sai ) రేప్ కేసు నమోదు అయ్యింది. యూట్యూబ్ లో బహుశా హర్ష సాయి అంటే తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే తను పేదలకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. తాజా గా ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టడం తో అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే హర్ష సాయి ఇలా చేసాడా అని అందరూ నమ్మకలేకపోతున్నారు. కేసు నమోదు అయ్యాక హర్ష సాయి అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం హర్ష సాయి మరియు తన ఫ్యామిలీ మెంబెర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
బాధిత యువతి పోలీసు స్టేషన్ లో హర్ష సాయి పై కేసు ( rape case filed on Harsha sai ) నమోదు చేసింది. బాధిత యువతి కేసు లో హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియో లతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత యువతి తెలిపింది. బాధిత యువతి కేసు నీ రాజేంద్ర నగర్ లో ఫైల్ చేసారు. తన దగ్గర చాలా పెద్ద మొత్తం లో డబ్బు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి పిర్యాదు చేసింది. ఈ బాధిత యువతి ఎవరో కాదు ఇది వరకు హర్ష సాయి తో సినిమా స్టార్ట్ చేసిన అమ్మాయి. కానీ తనే కేసు ఫైల్ చేయడం తో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసు స్టేషన్ వాళ్ళు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు రాజేంద్ర నగర్ లో నమోదు అయ్యిందని కేసు వివరాలు డిసిపి శ్రీనివాస్ తెలియజేశారు. యూట్యూబ్ లో హర్ష సాయి కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పోలీసులు ఏవిదంగా కేసు ను హ్యాండిల్ చేస్తారో చూడాలి. హర్ష సాయి రేప్ చేశాడు అంటే కొంచం నమ్మదగిన విషయం కాదు అనిపిస్తుంది. నిజా నిజాలు దర్యాప్తులో తెలుస్తుంది. దీని పై హర్ష సాయి ఎలా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాలి.