Karthi apology :
సత్యం సుందరం ( satyam sundaram movie ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు హీరో కార్తీ కూడా అటెండ్ అయ్యారు.ఈ ఈవెంట్ లో కార్తీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయ అంశం అయింది. ఎందుకంటే కార్తీ నార్మల్ గా లడ్డు గురించి కామెంట్ చేసారు కానీ ప్రస్తుతం తిరుపతి లడ్డు కల్తీ విషయం ఇండియా లో పెద్ద దుమారమే రేగింది. యాంకర్ కొన్ని మీమ్స్ చూపిస్తూ కార్తీ నీ అడిగింది. ఒక మీమ్ లో లడ్డు కావాలా అని మీమ్ ఉంది. దానికి హీరో కార్తీ ( karthi apology ) లడ్డు ప్రస్తుతం వద్దు అని కామెంట్ చేసారు.
దీన్ని అందరు చాలా ఖండించారు. దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించారు. ఇలా దేవుడి లడ్డు పై కామెంట్ చేయడం సరికాదు అని పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడే ముందు కొంచం ఆలోచించి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దీని పై వెంటనే హీరో కార్తీ రియాక్ట్ అయ్యారు. హీరో కార్తీ క్షమాపణలు ( karthi apology ) చెప్తూ సోషల్ మీడియా ఆప్ X లో ట్వీట్ చేసారు.
అయితే కొందరు కార్తీ క్షమాపణలు ( karthi apology ) చెప్పిన తర్వాత చాలా మంది అతడిని ప్రశంసించారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ అడగడం వల్లే తను అనాల్సి వచ్చిందని చాలా మంది x ఆప్ లో కామెంట్ చేశారు. కార్తీ చాలా సున్నితంగా ఈ ఇష్యూ నీ ముగించాడని మరికొందరు కామెంట్ చేసారు.
Photo credit : karthi twitter account
సత్యం సుందరం మూవీ తెలుగు లో సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వబోతుంది. ఈ చిత్రం లో కార్తీ తో పాటు అరవింద్ స్వామి కూడా నటించారు. ఈ సినిమాని ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి గోవింద్ వసంత్ మ్యూజిక్ నీ అందించారు. ఈ సినిమాని హీరో సూర్య మరియు జ్యోతిక 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా తమిళం లో సెప్టెంబర్ 27 న విడుదల కానుంది. సెప్టెంబర్ 27 న ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర సినిమా తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ సినిమాని తెలుగు లో సెప్టెంబర్ 28 న తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు.