poonam kaur sensational comments on trivikram :
తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ ( poonam kaur ) స్టార్ డైరెక్టర్ పై సంచలన వాఖ్యలు చేసారు. ఇది వరకు చాలా సార్లు ఆ డైరెక్టర్ పై తను కామెంట్లు చేసారు. కానీ ఎప్పుడు పూనమ్ కౌర్ వాక్యాలను పట్టించుకోలేదు ఎందుకంటే తను టాలీవుడ్ ఒక స్టార్ డైరెక్టర్ కాబట్టి, అతడు ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( trivikram srinivas ). నటి పూనమ్ కౌర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య ఇది వరకు చాలా సార్లు మాటల యుద్ధం జరిగింది.
తనని త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సార్లు ఇబ్బంది పెట్టారని , గతంలోనే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పిర్యాదు చేసాను గానీ ఎవరు పట్టించుకోలేదని అంతేకాకుండా తనని రాజకీయంగా కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసారని కచ్చితంగా సినీ పెద్దలు ఈ విషయం పై స్పందించాలి అని పూనమ్ కౌర్ ట్విట్టర్ X లో తను ట్వీట్ చేసారు.
పూనమ్ కౌర్ కి ( poonam kaur ) మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కి మధ్య ఏమి జరిగిందో ఏమో గానీ ఇది వరకు నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా సార్లు కామెంట్లు చేసారు. కానీ అప్పుడు దీనిపై ఎవరు సరిగా స్పందించలేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే , అయితే జానీ మాస్టర్ ను మాస్టర్ అని పిలవకూడదు అని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ లో పూనమ్ కౌర్ చాలా సినిమాలే చేసింది. మొదటగా పూనమ్ కౌర్ మాయాజాలం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. పూనమ్ కౌర్ తెలుగు లో గగనం , మాయాజాలం, నెక్ట్ ఏంటి, శౌర్యం ఇంకా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.
త్రివిక్రమ్ కి శ్రీనివాస్ కి మరియు పూనమ్ కౌర్ కి మధ్య అసలు ఏం జరిగిందో ఏమి తెలియదు ? ఎవరికి , ప్రస్తుతం తను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన ట్వీట్ టాలీవుడ్ లో సంచలనం రేపింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి ?