Aditi Rao hydari and sidharth marriage photos :
హీరోయిన్ అదితి రావు ( aditi rao hydari ) మరియు హీరో సిద్ధార్థ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ మరియు సన్నిహితుల మధ్య జరిగింది. వీళ్ళు ఇద్దరు ఎన్నో రోజులుగా ప్రేమించుకుంటున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వీళ్ళ పెళ్లి భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగింది. వీళ్ళ పెళ్లి ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రం లో వనపర్తి ప్రాంతం లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయం లో జరిగిందని సమాచారం.
ఈ రంగనాథ స్వామి దేవాలయం ప్రాచీన కాలం నాటికి చెందింది. ఈ దేవాలయం కి 400 ల సంవత్సరాల చరిత్ర ఉంది. హీరోయిన్ అదితి రావు హైదరి తమ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలలో హీరోయిన్ అదితి చాలా అందంగా ఉన్నారు. అంతేకాకుండా హిరో సిద్ధార్థ్ కూడా ఇంకా చిన్న వయసులో ఉన్న కుర్రాడు లాగే ఉన్నారు. తను షేర్ చేసిన ఫోటో లు చూస్తుంటే వీళ్ళ వివాహం సింపుల్ గా బంధువుల మధ్య జరిగిందని అనిపిస్తుంది. హీరోయిన్ అదితి రావు హైదరి పెళ్లి ఫోటోలలో చాలా హుందాగా ఉంది.
సిద్ధార్థ్ మరియు అదితి రావు మహాసముద్రం సినిమా వల్ల ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్ళి. అదితి రావు మొదటి వివాహం నటుడు సత్యదీప్ మిశ్రతో జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. సిద్ధార్థ్ కూడా మొదటి భార్యకి విడాకులు ఇచ్చాడు. అదితి రావు వనపర్తి సంస్థానానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళ పెళ్లి అదే సంస్థానంలో ఉన్న పురాతన ఆలయం లో పెళ్లి జరిగింది.
Aditi Rao hydari and sidharth marriage photos :