HomedevotionalSolar eclipse 2022 : సూర్యగ్రహణం ఏర్పడే సమయం

Solar eclipse 2022 : సూర్యగ్రహణం ఏర్పడే సమయం

Solar eclipse 2022 :

ఈ సంవత్సరం లో దీపావళి పండుగను ఏ తేదీలో జరుపుకోవాలి అని అందరిలో ఉన్న ఒక పెద్ద సందేహం కానీ అసలు ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే ఈ నేలలో ఏర్పడే సూర్య గ్రహణం ( Solar eclipse 2022 ) ఒక కారణం. ఈ సూర్య గ్రహణం ( Solar eclipse 2022 ) ఈ సంత్సరములో ఏర్పడే ఆకరి సూర్యగ్రహణం. అక్టోబర్ నెలలో ఏర్పడే ఈ సూర్యగ్రహణం ( Solar eclipse 2022 ) ఒక పాక్షిక సూర్య గ్రహణం. అసలు సూర్య గ్రహణం అంటే ఏంటి ? భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినపుడు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల కొంత సమయం సూర్యుడు కనిపించకుండా ఉంటాడు. అయితే ఈ సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం వెంట వెంటనే వస్తూ ఉండటంతో ఇది చాలా ప్రమాదకరమని పురోహితులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం ( Solar eclipse 2022 ) చాల రాశుల వారిపై ప్రభావితం చూపుతుందని పురోహితులు చెబుతున్నారు.

సూర్యగ్రహణం ఏర్పడే సమయం మరియు కనిపించే ప్రదేశాలు:

ఈ సూర్య గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా 2:26 నిమిషాలకు మొదలు అయ్యి 6:32 నిమిషాలకు ముగుస్తుంది. మొదట ఇది ఐస్ లాండ్ లో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని యూరప్, నార్త్ ఆఫ్రికా, నార్త్ అట్లాంటిక్ సముద్రం ఇలా చాలా దేశాల్లో కనిపించనుంది. భారత దేశం లో తక్కువ సమయం సూర్య గ్రహణం కనిపించనుంది. అంటే ఈ సూర్యగ్రహణం అన్ని చోట్ల కనిపించదు. భారత దేశంలో కనిపించే సమయం సాయంత్రం 4:16 నిమిషాల నుండి 6:32 నిమిషాల వరకు కనిపిస్తుంది. ఇది సూర్య గ్రహణం భారత దేశంలో 2 శాతం నుండి 50 శాతం మధ్యలో కనిపించనుంది. తెలుగు రాష్ట్రాలలో కనిపించే సమయం సాయంత్రం 4:50 నిమిషాల నుండి 5:10 నిమిషాల వరకు కనిపిస్తుంది.

Solar eclipse 2022

అలాగే ఈ సూర్య గ్రహణం సూర్యాస్తమయం వరకు ఉంటుంది అంటే 6:32 నిమిషాల వరకు ఉంటుంది. ఇదే ఈ సంత్సరంలో ఎర్పడే ఆకరి సూర్యగ్రహణం ఈ సంవత్సరం లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి అందులో రెండు సూర్య గ్రహణాలు రెండు చంద్ర గ్రహణాలు.మొదటగా రెండు ఏర్పడిన గ్రహణాలు ఏప్రిల్ మరియు మే నేలలో లోనే ఏర్పడ్డాయి కానీ అందులో సూర్య గ్రహణం భారత దేశంలో అంతగా కనిపించలేదు. రెండో సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో 25 తేది రోజు న ఏర్పడుతుంది. రెండో చంద్ర గ్రహణం వచ్చే నెల నవంబర్ 8 వ తేదిన వస్తుంది.

గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ తో ఉన్న వారు మరియు కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ తో ఉన్న వారు గ్రహణ సమయం మొత్తం కదలకుండా పడుకొనే ఉండడం మంచిది. ఆలాగే ఈ సూర్య గ్రహణం ప్రభావం ఎక్కువగా తుల రాశి వారిపై కనిపిస్తుందని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి తుల రాశి వారు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకుండా గ్రహణం ముందు స్నానం చేసి దేవుడి జపం చేసుకోవడం మంచిది అలాగే గ్రహణం సమయం అయిపోయాక మరుసటి రోజు స్నానం చేసి ఎదైన మీకు తోచినవి దానం ఇవ్వడం మంచిది ఎందుకంటే గ్రహణం వల్ల ఏర్పడే దోషాన్ని మీరు ఇలా దానం ఇవ్వడం వలన దోషం నుండి ఉపశమనాన్ని పొందవచ్చు అని పురోహితులు అంటున్నారు.

అలాగే గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానాలు చేయాలి. ఇలా చేస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే గ్రహణం మరుసటి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని దీపం వెలిగించి దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అలాగే గ్రహణం మరుసటి రోజు శివుడి గుడికి వెళ్లి దర్శించుకోవడం వలన చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో నేరుగా బయటకి వచ్చి సూర్యుడిని చూడవద్దు అని పురోహితులు అంటున్నారు. ఓక వేళ చూస్తే చాల దోషాలు వస్తాయి అని చెబుతున్నారు.

RELATED ARTICLES
LATEST ARTICLES