HomeBeauty tipsRosemary oil for skin care : మృదువైన చర్మం కోసం రోజ్మేరీ ఆయిల్

Rosemary oil for skin care : మృదువైన చర్మం కోసం రోజ్మేరీ ఆయిల్

Rosemary oil for skin :

రోజ్మేరీ ఆయిల్ ను ( rosemary oil for skin ) వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు మాత్రమే కాకుండా ఇది చర్మం ఆరోగ్యంగా ఉండేలా కూడ చూస్తుంది. దీన్ని ఎక్కువగా చర్మ సంబంధమైన ప్రొడక్ట్ ల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో రోజ్మేరీ ఆయిల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ లకి మంచి డిమాండ్ ఉంది. రోజ్మేరీ ఆయిల్ ను ( rosemary essential oil ) రోజు వాడటం వల్ల మీ చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. రోజ్మేరీ ఆయిల్ రోజు వాడటం వల్ల మీ మొహం పై ఉన్న మచ్చలు మరియు ముడతలను కూడ ఇది పోగొడుతుంది. అందుకే దీన్ని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతున్నారు.

రోజ్మేరీ ఆయిల్ వాడటం వల్ల కలిగే ఉపయోగాలు : benefits of rosemary oil for skin

  1. రోజ్మేరీ ఆయిల్ ( pure rosemary oil ) మన మొహానికి చక్కటి మాయిశ్చరైజర్ ల పనిచేస్తుంది. చర్మం త్వరగా పొడి బారకుండ కాపాడుతుంది. మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
  2. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి మొహం పై రంధ్రాలు ఉండటమే కాకుండా మరియు త్వరగా ఆయిల్ చేరుకుంటుంది. ఇది మొహం పై ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
  3. రోజ్మేరీ ఆయిల్ ( rosemary serum ) మంచి యాంటీ ఏజెనింగ్ ల పని చేస్తుంది. దీన్ని ఫేస్ కి అప్లై చేయడం వల్ల మొహం పై ఉన్న ముడతలు పోగొట్టి , యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
  4. కళ్ళ చుట్టూ కొందరికి చర్మం నల్లగా మారుతుంది. అలాంటి వారు రోజు రోజ్మేరీ ఆయిల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను పోగొట్టవచ్చు.
  5. రోజ్మేరీ ఆయిల్ మొహం పై హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడిన మచ్చలను పోగొడుతుంది.
  6. రోజ్మేరీ ఆయిల్ ( rosemary oil for skin ) మొహంపై మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను కూడ పోగొడుతుంది.
  7. మొహంపై ఏర్పడిన గాయలని కూడ ఈ రోజ్మెరీ ఆయిల్ తగ్గిస్తుంది.
  8. రోజ్మెరీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. రోజ్మెరీ ఆయిల్ వాడటం వల్ల మొహంపై బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నీ తగ్గిస్తుంది.
  9. రోజ్మెరీ ఆయిల్ ను ( rosemary oil ) రాత్రి పూట మొహానికి పట్టించడం వల్ల మొహం పై మొటిమలు రాకుండా కాపాడుతుంది.

రోజ్మెరీ ఆయిల్ ను ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : side effects of rosemary oil

  1. తగిన పరిమాణం లో మాత్రమే మొహంపై అప్లై చేయండి. దురద వచ్చే ప్రమాదం ఉంది.
  2. మొహంపై లిప్స్ పై వెంట్రుకలు ఉన్న వాళ్ళు దీన్ని తక్కువగా వాడటం మంచిది. ఎందుకంటే ఇది హెయిర్ పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
  3. రోజ్మెరీ ఆయిల్ ను అప్లై చేసిన తర్వాత బయటకు వెళ్ళకండి. బయటకు వెళ్ళాలి అనుకుంటే సన్ స్క్రీన్ లోషన్ వాడటం చాలా మంచిది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

LATEST ARTICLES