HomeHealthRosemary leaves : రోజ్మెరీ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

Rosemary leaves : రోజ్మెరీ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

Rosemary leaves :

పూదిన కుటుంబానికి చెందిన ఈ రోజ్మెరీ మొక్క తో ( rosemary leaves ) ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విదేశీ వంటకాల్లో ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని వంటకాల్లో పూదిన ఆకులని బదులు వంటకాల్లో ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని వాడుతారు. ఈ రోజ్మెరీ మొక్క యొక్క ఆకులని బ్రెడ్ , సూప్స్, మసాహరం మరియు సాలడ్స్ తయారీలో ఎక్కువగా వాడుతారు. అంతేకాకుండా దీన్ని హెర్బల్ టీ తయారీలో ఎక్కువగా వాడుతారు. రోజ్మెరీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

రోజ్మెరీ మొక్క ఆకులు చర్మ సంబంధిత ప్రొడక్ట్ ల తయారీలో వాడుతారు. అంతేకాకుండా ఈ ఆకుల్ని ( rosemary leaves for hair ) జుట్టు సంబంధిత ప్రొడక్ట్ ల తయారీలో కూడా వాడుతారు. ఇది రాలిపోయే జుట్టుని కాపాడటమే కాకుండా జుట్టు వోత్తుగా మరియు బలంగా పెరుగుతుంది. ఇది చర్మం పై ఉన్న మచ్చలు ( rosemary leaves for skin ) మరియు మొటిమలు పోగొట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఈ రోజ్మెరీ మొక్క ఆకుల్ని తెంపి ఎండబెట్టి కూడ వాడుతారు. అంతేకాకుండా ఈ రోజ్మెరి కి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.

రోజ్మెరీ మొక్క ( dried rosemary leaves ) చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఎక్కువగా ఇసుక నెలలో పెరుగుతుంది. ఈ రోజ్మెరీ మొక్క పొదలాగా గుంపుగా పెరుగుతుంది. దీంట్లో రెండు రకాల మొక్కలు ఉంటాయి. ఒక మొక్క పొడవుగా తీగ లా పెరుగుతుంది. ఇంకొక రకం మొక్క ( rosemary plant ) పొద లా గుంపుగా పెరుగుతుంది. ఈ రెండింటినీ వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. ఈ రోజ్మెరీ మొక్క బూడిద రంగు కొమ్మలు మరియు ఆకులు ఆకుపచ్చటి రంగులో సూదుల్లా ఉంటాయి. ఈ మొక్క దాదాపుగా మూడు అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది.

రోజ్మెరీ మొక్క ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు : Rosemary leaves benefits

  1. రోజ్మెరీ మొక్క ఆకుల్ని చర్మ సౌందర్యానికి ఎక్కువగా వాడుతారు.
  2. రోజ్మెరీ మొక్క ఆకులు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జుట్టు రాలిపోయే సమస్యని కూడ తగ్గిస్తుంది.
  3. రోజ్మెరీ ఆకులు ఓళ్లు నొప్పులను కూడ తగ్గిస్తాయి.
  4. రోజ్మెరీ మొక్క ఆకులు మొహంపై ఉన్న మొటిమలను తగ్గించి వాటి ద్వారా ఏర్పడిన మచ్చలను కూడ తొలగిస్తుంది.
  5. దీన్ని ఎక్కువగా పెర్ఫ్యూమ్ మరియు రూం ఫ్రేష్నర్ లా తయారీలో వాడుతారు.
  6. రోజ్మెరీ మొక్క ను ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది .
  7. ఇది కడుపులో మలబద్దకం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలని తగ్గిస్తుంది.
  8. రోజ్మెరీ శరీరం లో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  9. రోజ్మెరీ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా వొత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
  10. రోజ్మెరీ మొహం పై ఉన్న బొంగు మచ్చలు మరియు ముడతలను పోగొడుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES