HomeBeauty tipsHow to prevent white hair : తెల్ల జుట్టు నల్లగా మారటానికి చిట్కాలు

How to prevent white hair : తెల్ల జుట్టు నల్లగా మారటానికి చిట్కాలు

How to prevent white hair :

తెల్ల జుట్టు ( white hair ) ఈ మాట ప్రతి ఒక్కరి నోటి నుండి జీవితంలో ఎప్పుడో ఒకసారి తమకు వచ్చిందని వినాల్సిందే కానీ తెల్ల జుట్టు అనేది ముసలి వారు అయ్యాక రావడం సహజం కానీ చిన్న పిల్లలో మరియు యవ్వనంగా ఉన్నపుడు రావడం చాలా బాధాకరం. తెల్ల జుట్టు ( how to prevent white hair ) వచ్చినపుడు దాన్ని దాచుకోవడానికి కొన్ని రోజులు పనిచేసే కలర్లు వేసుకోవచ్చు కానీ అవి శాశ్వతం కాదు. కాబట్టి ముందు చిన్న వయసులో తెల్ల జుట్టు ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం.

తెల్ల జుట్టు రావడానికి కారణాలు ( Pre mature White hair causes ) : తెల్ల జుట్టు చిన్న వయసులో రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. ( reason for white hair )

  1. మానసిక ఒత్తిడి ఉన్నవారిలో తొందరగా తెల్ల జుట్టు రావడం గమనించవచ్చు.
  2. ఎవరి ఇంట్లో వారి వంశంలోని ముందు తరాల వారికి తెల్ల జుట్టు ఉంటుందో వారిలో వంశపారపర్యంగా తెల్ల జుట్టు రావడం గమనించవచ్చు.
  3. శరీరంలో కాపర్ లోపం వలన కూడా తెల్ల జుట్టు చిన్న వయస్సులో రావడానికి ముఖ్య కారణం కావచ్చు.

చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా మరియు వచ్చిన వాటిని తగ్గించడానికి కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ( how to stop white hair )

1.శరీరంలో కాపర్ తగినంత లేకపోవడం వలన తెల్ల జుట్టు ( white hair causes ) రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో కాపర్ ఉన్న ఆహారం తీసుకుంటేనే తెల్లగా మారిన జుట్టుని నల్లగా మారటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న పిల్లలకి కాపర్ ఉన్న ఆహారం సరిగా తీసుకునేలా జాగ్రత్త పడడం మంచిది.

2.సముద్రంలో దొరికే ఏ ఆహారం అయిన పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి మన శరీరానికి కావల్సిన న్యూట్రీషన్లు అందచేస్తుంది.సముద్రపు ఆహారాల వలన జుట్టు వోతుగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టుని నల్లగా మారటానికి ఉపయోగపడుతుంది.

3.మష్రూమ్స్ (పుట్టగొడుగులు) తినడం వలన కూడా చిన్న తనంలో వచ్చిన తెల్ల జుట్టు నల్లగా మార్చేసుకోవచ్చు.

4.ఎక్కువ క్యాటలేస్ ఉన్న ఆహారాలు కూడా జుట్టు నల్లగా మారటానికి మరియు హెల్తీగా ఉండటానికి తోడ్పడతాయి.

5.మొలకెత్తిన విత్తనాలు (పప్పులు) తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ముందుగా వచ్చే తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.

6.కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు. కూరగాయలలో ముఖ్యంగా కబాజ్జి , క్యాలీఫ్లవర్, బ్రోకొలి లాంటివి తీసుకుంటే జుట్టు పోషణకు తోడ్పడతాయి.

తెల్ల జుట్టు రాకుండా కొన్ని చేయకూడని పనులు తినకుండా ఉండాల్సిన ఆహారాలు కూడా ఉన్నాయి.

How do I stop my hair from Greying ?

  1. సిగరెట్ తాగడం పూర్తిగా మానేయాలి.
  2. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి.
  3. జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.
  4. చెక్కరని పూర్తిగా మానేయాలి.
  5. రిఫైనెడ్ ఆహారాలు తీసుకవడం మంచిది కాదు.
RELATED ARTICLES
LATEST ARTICLES