Face serum for men :
ఈ మధ్య కాలంలో అందం గురించి ఆలోచించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్ళు మాత్రమే తమ అందం గురించి శ్రద్ధ చూపించే వారు ఇప్పుడు అలా కాదు మగవారు కూడా అందం గురించి ఆరాటపడుతున్నారు. కానీ చాలా మంది మగవారికి మొఖం మీద ఏర్పడిన చర్మ సమస్యలకు ఎలాంటి సీరమ్స్ వాడలో తెలియక ఏదో ఒకటి వాడేస్తున్నారు. అలా వాడటం వలన సమస్యలు తగ్గకుండా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని రకాల సిరమ్స్ నీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఏ రకమైన సీరమ్ వాడలో తెలుసుకుందాం…
పురుషుల చర్మ సౌందర్యానికి ఉపయోగపడే సీరమ్స్( best face serum for men )
1.విటమిన్ సి సిరమ్ ( vitamin c serum ) :
విటమిన్ సి సిరమ్ నీ ఎవరైతే మగవారు చర్మం పై కాంతి లేకుండా డల్ గా ఉన్న చర్మం లో బాధపడుతున్నరో అలాంటి వారు ఈ సీరమ్ నీ వాడటం వలన చర్మం కాంతి వంతంగా తయారౌతుంది. ఎందుకంటే విటమిన్ సి సీరం లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటడం వలన చర్మాన్ని కాంతివంతంగా ఉంచేలా మరియు మొహం మీద ఏర్పడే నల్లటి మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
2.రిటినాల్ సీరం ( retinol serum ) : Face serum for men
చాలా మంది మగవారు చిన్న వయసులో ఎక్కువ వయసు అయినట్టుగా కనిపిస్తారు. అంతే కాకుండా మొహం మీద ముడతలు మరియు నల్లటి చారలు కనిపిస్తాయి. అలాంటి వారికి రెటినాల్ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెటినాల్ చర్మం యెక్క సెల్స్ నీ యాక్టివేట్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మరియు కోలాజీన్ నీ ఉత్పత్తి చేసి చర్మం పైన ముడతలను తగ్గించటానికి ఉపయోగపడుతుంది.
3.హిల్యూరోనిక్ సీరం ( hyaluronic serum ) :
మగవారు తరచుగా బయట తిరుగుతూ ఉంటారు దాని వలన చర్మం పొడిబారడం మరియు కొందరికి దురదగా మంటగా ఉండటం మరి కొందరిలో పొర పొరలు గా చర్మం మీద లేయర్ రాలిపోవడం చూస్తుంటారు. అలాంటపుడు మగవారు ఈ హ్యాల్యురానిక్ నీ వాడటం వలన ఈ సీరం చర్మాన్ని హైడ్రేట్ గా చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజు ఈ హ్యలురానిక్ సీరం వాడటం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి అని డాక్టర్స్ చెబుతున్నారు.
4.నాయన్సినమైడ్ సీరం ( naincinamide seram ) : face serum for men
ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్ల వలన చాలా మంది మగవారు ఆయిల్ స్కిన్ తో బాధపడుతున్నారు. ఆయిల్ స్కిన్ అనేది కొందరి కి వంశపారంపర్యంగా కూడా ఆయిల్ స్కిన్ వస్తుంది. చర్మం ఆయిల్ ఉత్పత్తి కావడం ఆపడానికి చర్మం ఆ జిడ్డు తనం నుండి బయట పడడానికి చాలా రకాల క్రీమ్స్ వాడుతుంటారు. కానీ కొందరికి పని చేస్తాయి కొందరికి పని చేయవు అలాంటి వారికి ఈ నాయన్సినమైడ్ సీరం చాలా ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు.
అంతే కాదు ఈ సీరం అక్నే నీ కూడా తగ్గిస్తుంది.
5.సాల్లిసిల్లిక్ సీరం ( sallicyllic serum ) :
మగవారిలో ఒక వయసు వచ్చిన వెంటనే అయిన హార్మోనల్ ఇన్బల్లెన్స్ వలన మంచి ఆహారం తీసుకోకపోయినా ముందుగా వచ్చే సమస్య చర్మం పై మొటిమలు మరియు మొటిమల వలన వచ్చిన మరకలు కొందరిలో బ్లాక్హెడ్స్ వైట్హెడ్స్ అని చాలా రకాల సమస్యలు బాధపెడుతుంటాయి. అలాంటి వారికి ఒక మంచి మెడిసిన్ గా సాల్లిసిల్లిక్ సీరం పనిచేస్తుంది. అంతే కాదు ఈ సీరం ముడతలను కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది.