HomeHealthPCOD symptoms in females : పాలసిస్టిక్ ఓవరీ డిసీజ్ లక్షణాలు

PCOD symptoms in females : పాలసిస్టిక్ ఓవరీ డిసీజ్ లక్షణాలు

PCOD Symptoms : పాలసిస్టిక్ ఓవరీ డిసీజ్ లక్షణాలు

పీసీఓడీ సమస్య లక్షణాలు ( PCOD symptoms ) : పాలసిస్టిక్ ఓవరీ డిసీజ్
చాలా మంది ఆడవారిలో ముందుగా కొన్ని రకాల లక్షణాలను బట్టి పీసీఓడీ నీ ముందుగానే తెలుసుకోవచ్చు. అలా అని అందరిలో లక్షణాలు కనిపించాలని కూడా లేదు. ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా పిసిఓడీ సమస్య చాలా మంది ఆడవారిని బాధిస్తుంది. అన్ని లక్షణాలలో ముందుగా కనిపించే లక్షణం…


1.ఋతుస్రావం ఆగిపోవడటం ( irregular menstrual cycle ) :
పీసీఓడీ లో ముందుగా కనిపించే లక్షణం పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం మరియు పీరియడ్స్ మొత్తమే ఆగిపోవడం కొందరిలో పీరియడ్స్ మూడు నెలల కి ఒకసారి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటపుడు కచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ నీ కలవాలి లేదంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
2.అవాంఛిత రోమాలు ( unwanted hair ) :
పీసీఓడీ సమస్య వచ్చినప్పుడు ఆడవారిలో మొహం పైన చేతుల పైన కాళ్ళ పైన వెంట్రుకలు ఒత్తుగా రావడం ముఖ్యంగా పై పెదవి పైన ఎక్కువగా చూస్తుంటాం.

3.బరువు పెరగడం ( heavy weight ) :
కొందరిలో అధిక బరువు వలన పీసీఓడీ వస్తే మరి కొందరిలో పీసీఓడీ వలన బరువు పెరుగుతుంటారు. కాబట్టి అధిక బరువు పెరగడం కూడా పీసీఓడీ లో ఒక లక్షణం.

4.వెంట్రుకలు రాలిపోవడం ( hair loss ) : pcod symptoms
Pcod వచ్చిన ఆడవారిలో ఎక్కువగా తల మధ్యలో ఉండే వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోవడం మరియు వెంట్రుకలు పలుచబడటం కనిపిస్తుంది.

5.మొటిమలు మరియు ఆక్నే ( suffering with acne and pimples ) :
పీసీఓడీ వచ్చిన వారిలో మొహం పై మొటిమలు మరియు అక్నీ బాధపెడుతుంది.
6 . ఇన్ఫర్టిలిటీ ( infertility ) :
Pcod ఉన్న ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్య ప్రెగ్నెన్సీ రాకపోవడం మరియు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో కూడా నిలవకపోవడం చూస్తుంటారు.

7.నిద్రలేమి ( sleep apnea ) : pcod symptoms
పీసీఓడీ సమస్య వచ్చినపుడు కొంత మందిలో నిద్రలేమి సమస్య కూడా బాధిస్తుంది.
8.చర్మం నల్లగా మారడం ( skin pigmentation ) :
చర్మం పై నల్లటి చారలు మరియు మూతి చుట్టూ ముక్కు పైన నల్లగా మారడం. మెడ దగ్గర నల్లగా మారటం పీసీఓడీ వచ్చిన వారిలో కనిపించే చర్మానికి సంబంధించిన సమస్య.

RELATED ARTICLES
LATEST ARTICLES