Ranapala plant :
మన ఇంటి దగ్గర పెరిగే మొక్కలలో చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఏ యే మొక్కలలో ఏమి ఏమి ఆయుర్వేద గుణాలు ఉన్నాయో అని చాలా మందికి ఈ విషయం తెలీదు. ఈ మొక్కలు పూర్వ కాలం నుంచి ఇప్పటివరకు చాలా రకాల ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. రణపాల మొక్క ( ranapala plant ) కూడ చాలా మంది ఇంటి దగ్గర పెంచుకుంటారు. ఈ మొక్క తో చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఎవరి ఇంట్లో అయిన ఈ రణపాల మొక్క ranapala plant కనిపిస్తే అస్సలు వదలకండి. రణపాల మొక్క యొక్క ఆకుని తినండి చాలు మీ ఆరోగ్య సమస్యలు అన్ని తీరిపోతాయి. రణపాల మొక్క ఆకు కొంచం వగరు రుచి ని కలిగి ఉంటుంది. రణపాల మొక్క ని పర్ణ బీజ, హెమసాగర్ లేదా అష్టి భక్ష అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రణపాల మొక్క ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని ఏవర్ గ్రీన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు.
రణపాల మొక్క ranapala plant ఆకుని కొన్ని వంటకాల్లో కూడా వాడుతారు ఎందుకంటే దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన రుచి ని కలిగి ఉంటుంది అందుకే దీన్ని వంటకాల్లో వాడుతారు. శతాబ్దాల కాలం నుంచి ఇప్పటి వరకు రక రకాలైన వ్యాధుల నివారణకు ఈ మొక్క ని వాడుతున్నారు.
Neutrient values in ranapala plant :
ఈ మొక్కని ఇంటి ముందర పెరట్లో కాకుండా కుండీల్లో కూడా ఎక్కువగా పెంచుతారు .ఎందుకంటే దీంట్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రణపాల మొక్క లో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ హిస్టమైన్ గుణాలు ఉన్నాయి. రణపాల మొక్క ఆకుని కిడ్నీ లో రాళ్ళని కరిగించడంలో లో ఎక్కువగా సహాయపడుతుంది.
Ranapala plant benefits : రణపాల మొక్క యొక్క ఉపయోగాలు
1.రణపాల మొక్క కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తుంది. రణపాల మొక్క కిడ్నీ లో రాళ్ళని కరిగించడానికి బ్రంహస్త్రంలా పనిచేస్తుంది. దీన్ని కిడ్నీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. రోజు ఈ చెట్టు యొక్క ఆకుల్ని కషాయాన్ని తయారు చేసి తీసుకుంటే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
2.కొందరికి రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ తగ్గుతాయి. అలాంటి వారు రణపాల మొక్క ఆకుల్ని తింటే రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి.
3.దెబ్బలు తగిలినప్పుడు ఈ రణపాల మొక్క ఆకుల్ని వుడికించి దెబ్బ పై కట్టు కట్టాలి. ఇలా చేస్తే గాయం త్వరగా తగ్గుతుంది.
4.పని వొత్తిడి కారణంగా కొందరు తీవ్రమైన తల నొప్పితో బాధపడతారు. అలాంటి వారు ఆకుల రసాన్ని నుదిటి పై రాసుకుంటే తల నొప్పి త్వరగా తగ్గుతుంది.
5.రణపాల మొక్క శరీరంలో వచ్చే వాపులను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా కొవ్వు గడ్డలను కూడా కరిగిస్తుంది.
6.స్త్రీలు ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారు రోజు ఈ రణపాల మొక్క ఆకుల రసాన్ని తీసుకుంటే త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.