Coriander powder :
ధనియాల పొడి ని ( Coriander powder ) అందరూ వంట గదిలో ఎక్కువగా వాడుతారు. ధనియాల పొడి ని వంటకాల్లో రుచి కోసం వాడుతారు. ధనియాల పొడి ని వంటకాల్లో నే కాకుండా ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. ధనియాల పొడి ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. ధనియాల పొడి ని ఎక్కువగా సాంబార్ లో మరియు కూరలలో వాడుతారు. ధనియాల పొడి కొంచం వగరు మరియు ఘాటు రుచిని కలిగి ఉంటుంది.
ధనియాలను ఆంగ్లంలో కొరియాండర్ అని పిలుస్తారు. ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ధనియాల పొడి ని రోజు వంటకాల్లో మనం వాడతాం. ధనియాల పొడి ని రోజు నీళ్లలో కలుపుకుని తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది. ధనియాల పొడి లో విటమిన్స్ , కాల్షియం , ఐరన్ , ప్రొటీన్లు మరియు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.

ధనియాల పొడి కషాయం తయారీ విధానం : coriander water ( aachi coriander powder )
ధనియాల ని ( Coriander powder ) గ్రైండర్ లో వేసి పొడి చేయాలి. తర్వాత ఒక చెంచాడు పొడిని తీసుకుని , ఒక గ్లాస్ వాటర్ తీసుకుని బాగా మరగ బెట్టాలి. ఆ తర్వాత చల్లార్చి , వడగట్టాలి. రోజు ఉదయం ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఇలా కషాయం తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, రక్తం లో షుగర్ లెవెల్స్ తగ్గుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు. ధనియాల పొడి వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.
ధనియాల పొడి తో ఆరోగ్య ప్రయోజనాలు : coriander powder benefits
1.ప్రతి రోజూ ధనియాల పొడి నీళ్ళు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
2.ధనియాల పొడి నీరు ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరం లో హాని చేసే ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడం లో సహాయపడుతుంది.
3.జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నవారు రోజు ధనియాల వాటర్ ని తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ధనియాల లో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
4.రోజు ధనియాల నీరు ని తీసుకోవడం వల్ల శరీరం లో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది.
5.ధనియాల నీరు ని తాగడం వల్ల రక్తం లో ఉన్న చక్కెర స్థాయి తగ్గుతుంది. చక్కెర స్థాయి రక్తం లో ఎక్కువగా ఉన్నపుడు ధనియాల నీరు ని తాగమని వైద్యులు సూచిస్తున్నారు.