Black pepper powder :
నల్ల మిరియాలు ( black pepper ) అంటే బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నల్ల మిరియాలను మనం వంటల్లో మసాలా దినుసు గా వాడుతాం. నల్ల మిరియాల ని ఎక్కువగా మన దేశంలో నే పండిస్తారు. ఈ నల్ల మిరియాల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటి ధర కారణంగా వీటిని కొందరు వాడటానికి ఆలోచిస్తుంటారు. నల్ల మిరియాలను ఎక్కువగా మాంసాహార వంటకాలలో రుచి మరియు ఘాటు కోసం దీన్ని వాడుతారు.
ఎక్కువగా నల్ల మిరియాల పౌడర్ ని ( black pepper powder ) కొన్ని ఫ్రై వంటకాల్లో మరియు బిర్యానీ లో వాడుతారు. నల్ల మిరియాల రుచి కొచం చేదుగా మరియు ఘాటు గా ఉంటుంది. కరోనా సమయం లో నల్ల మిరియాల పొడిని నీళ్లలో లేదా పాలల్లో కలుపుకుని తీసుకునేవారు ఎందుకంటే ఇది మన శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దగ్గు మరియు జలుబు ని త్వరగా తగ్గిస్తుంది. అందుకే ఈ నల్ల మిరియాల పొడిని కొన్ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు.
ఈ సుగంధ ద్రవ్యాలలో ఈ నల్ల మిరియాలకి ( black pepper powder ) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నల్ల మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసేస్ గా పిలుస్తారు. బ్రిటిష్ వారు మన భారత దేశం ని పరిపాలించినప్పుడు కూడా నల్ల మిరియాల కి మంచి డిమాండ్ ఉండేది. అందుకే బ్రిటిష్ వారు నల్ల మిరియాలను మన దేశం నుంచి వాళ్ళ దేశానికి ఎగుమతి చేసేవారు. వీటిని మన దేశం లో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు.
Neutrients values in black pepper powder : నల్ల మిరియాల లో పోషక విలువలు
నల్ల మిరియాల లో ( pepper powder ) చాలా పోషక విలువలు ఉన్నాయి. నల్ల మిరియాల లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. అంతేకాకుండా నల్ల మిరియాల లో ఫ్యాటీ యాసిడ్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి.
నల్ల మిరియాల తో ఆరోగ్య ప్రయోజనాలు : black pepper benefits
1.నల్ల మిరియాల పొడిని రోజు నీళ్ళలో కలుపుకుని తాగడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తినే ముందు తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది.
2.నల్ల మిరియాలని తీసుకోవడం వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే విటమిన్ సి, విటమిన్ ఎ , ఫ్లావనోయిడ్ , యాంటీ యాక్సిడెంట్లు మరియు కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. స్త్రీ లలో వచ్చే రొమ్ము క్యాన్సర్ తో కూడా ఇది పోరాడుతుంది.
3.నల్ల మిరియాల లో పైపెరెన్ ఉంటుంది. ఇది వొత్తిడి ని తగ్గిస్తుంది. వొత్తిడి లో ఉన్నపుడు కొంచం మిరియాల పొడిని తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది.
4.జలుబు మరియు దగ్గు సమస్యతో బాధపడుతున్నవారు కొంచం పాలల్లో మిరియాల పొడిని తీసుకుంటే జలుబు ,దగ్గు మరియు జ్వరం త్వరగా తగ్గుతుంది.
5.వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కి లోనవుతుంది. అప్పుడు మిరియాలను తీసుకుంటే డీహైడ్రేషన్ కి లోనవ్వకుండా మరియు చర్మం పొడి బారకుండ కాపాడుతుంది.
6.డయాబెటిక్ పేషంట్స్ నల్ల మిరియాల పొడిని తీసుకోవడం వల్ల రక్తం లోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
7.బరువు తగ్గాలి అనుకునేవారు రోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో చిటికెడు నల్ల మిరియాల పొడిని వేసి మరిగించి తాగితే ఉబకాయం తగ్గుతుంది.
8.దంతాలు మరియు చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నవారు చిటికెడు ఉప్పు ని, ఒక చెంచా మిరియాల పొడి కి కలిపి దంతాలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.