HomeHealthUttareni : ఉత్తరేణి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Uttareni : ఉత్తరేణి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Uttareni :

ఉత్తరేణి ఆకు ( uttareni ) ని సర్వ రోగ నివారిణి లేదా ఔషధాల గని అని అంటారు. ఎందుకంటే ఉత్తరేణి ఆకు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉత్తరేణి ఆకు ని మనం ఎక్కువ పల్లెటూర్లలో చూస్తుంటాం. ఉత్తరేణి ఆకు ని వినాయక చవితి రోజు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో ఈ ఆకుని దేవుడికి సంపర్పిస్తాం. వినాయక పూజ క్రమంలో ఈ ఆకుకి ఆరవ స్థానం. ఉత్తరేణి ఆకు ని పూజలల్లోనే కాకుండా ఆయుర్వేదం లో ఎన్నో రకాల మందుల తయారీలో వీటిని వాడుతారు. ఉత్తరేణి ఆకు ని మాత్రమే కాకుండా ఆ మొక్క యొక్క కాండాన్ని కూడా మందుల తయారీలో వాడుతారు. ఉత్తరేణి మొక్క యొక్క కాండం కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

పల్లెటూర్లలో చాలామంది పాము కాటుకి లేదా తేలు కాటుకి గురవుతుంటారు. పాము కాటుకి లేదా తేలు కాటుకి సరైన వైద్యం సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్ల చనిపోతుంటారు. ఉత్తరేణి ఆకు ని ( uttareni aaku ) ఈ పాము కాటు కి మరియు తేలు కాటుకు ప్రాథమిక చికిస్థలో లో వాడుతారు. ఇలా ఒకటి కాదు , రెండు కాదు ఉత్తరేణి ఆకు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉత్తరేణి మొక్క పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది.

పల్లెటూర్లలో ఉత్తరేణి మొక్క ( uttareni plant ) గురించి తెలియని వారు దీన్ని ఒక కలుపు మొక్కగా తీసి పడేస్తుంటారు. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఉత్తరేణి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. తెలుగులో దీన్ని ఉత్తరేణి ( uttareni chettu ) లేదా దుచ్చేన చెట్టు అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ మొక్కని అపామర్గ లేదా కరమంజరి అని పిలుస్తారు.

ఉత్తరేణి తో ఆరోగ్య ప్రయోజనాలు : Uttareni benefits

1.మూత్ర పిండాల లో రాళ్ళ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఉత్తరేణి ఆకుల రసం ని తాగితే కిడ్నీ లో రాళ్ళని కరిగిస్తుంది.

2.ఉత్తరేణి మొక్క విత్తనాలను పాలలో కడుపుకుని తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.

3.అజీర్ణ సమస్యతో బాధపడుతున్నవారు ఉత్తరేణి వేర్లని కాల్చి బూడిద చేసి తీసుకుంటే చక్కటి పలితం ఉంటుంది.

4.పిచ్చి కుక్క కరిచినప్పుడు ఉత్తరేణి విత్తనాల చూర్ణం ని తీసుకుంటే పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చే హైడ్రోఫోబియా తగ్గుతుంది.

5.ఉత్తరేణి మొక్క వేరుని ఎండబెట్టి పొడి గా చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

6.ఇన్ఫెక్షన్ల వల్ల చర్మం పై దురదలు మరియు దద్దుర్లు వస్తుంటాయి. అప్పుడు ఉత్తరేణి ఆకుల రసాన్ని రాస్తే దురద మరియు దద్దుర్లు తగ్గుతాయి.

7.తేలు కాటుకు మరియు పాము కాటుకు గురి అయినప్పుడు ఉత్తరేణి ఆకులను తినడం వళ్ల మరియు కరిచిన చోట ఆకు రసాన్ని రాస్తే విషపూరితం కాకుండా ఉంటుంది.

8.చాలా మంది ఉబాకయం సమస్యతో బాధపడుతింటారు .అలాంటి వారు ఉత్తరేణి ఆకు ని మరియు వెర్లని నీటిలో మరిగించి తాగాలి. వారానికి ఇలా ఒకసారి చేయడం వల్ల ఉబాకాయం సమస్య తగ్గుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES