HomeHealthinguva : ఇంగువ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

inguva : ఇంగువ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Inguva :

ఇంగువ ( inguva ) బహుశా తెలియని వారు ఉండరేమో ? ఎందుకంటే ఇంగువ ని ఎక్కువగా మనం వంటకాల్లో వాడతాం. ఇంగువ వంటకాల్లో వాడే ఒక సుగంధ ద్రవ్యం. ఇంగువ చూడటానికి పసుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎక్కువగా ఘాటు వాసనను కలిగి ఉంటుంది. దిన్ని మనదేశం లో కూడా ఇప్పుడు పండిస్తున్నారు. ఇంగువ ఎక్కువగా ఆఫ్గనిస్తాన్ మరియు ఇరాన్ దేశంలో పండిస్తారు. ఇంగువ నీ ఎక్కువగా యునాని వైద్యం లో ట్రీట్మెంట్ కి ఎక్కువగా వాడతారు. ఇంగువ నీ సంస్కృతంలో హింగ్ అని పిలుస్తారు. ఇంగువ నీ ఆంగ్లం లో asafoetida or hing ( inguva in english ) అని పిలుస్తారు. ఇంగువ మొక్క సన్నగా కాండంతో , గుబురుగా పొదలుగా పెరుగుతుంది.

ఇంగువ లో ( inguva ) ఎక్కువగా ఐరన్ , ఫాస్పరస్, కాల్షియం , బి విటమిన్ మరియు కేరాటిన్ ఉంటుంది. మొదటగా ఇంగువ ద్రవ రూపంలో ఉంటుంది ఇది కొన్ని నెలల తర్వాత గట్టిగా దృఢంగా మారుతుంది. దిన్ని ఎక్కువగా వంటకాల్లో వాడతారు మరియు అంతేకాకుండా ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడతారు. ఎందుకంటే దీనికి కొన్ని జబ్బులు తగ్గించే గుణం ఉంది.

Inguva benefits in telugu

ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు : inguva benefits

  1. తిన్న తర్వాత ఆహారం జీర్ణం అవ్వడానికి ఇంగువ నీ వాడతారు. ఎందుకంటే ఇంగువ కి త్వరగా తిన్న ఆహారం జీర్ణం చేసే శక్తి ఉంటుంది.
  2. కొన్ని సార్లు జామ చెట్టుకు ఎక్కువగా కాయలు కాయవు. అలాంటప్పుడు జామ చెట్టు మొదట్లో ఇంగువ పొడిని ( inguva powder ) వేయడం వల్ల జామ చెట్టుకు ఎక్కువగా కాయలు కాస్తాయి. జామ కాయ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జామ కాయ తినడం వల్ల శరీరం లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  3. చాలా మంది నరాల బలహీనతో బాధ పడుతుంటారు. అలాంటి వారు ఇంగువ నీ ఆహారం లో చేర్చడం వల్ల మీ నరాల బలహీనత తగ్గుతుంది.
  4. ఇంగువ నీ తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్రేగులో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  5. కొందరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు ఇంగువ నీ తీసుకోవడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది మరియు నిద్ర లేమి సమస్య తగ్గుతుంది.
  6. స్త్రీలు పీరియడ్స్ సమయంలో చాలా కడుపు నొప్పితో బాధపడతారు అలాంటి వారు ఇంగువ తీసుకోవడం వల్ల పెయిన్ తగ్గుతుంది మరియు అధిక రక్త స్రావం కూడా తగ్గిస్తుంది.
  7. పంటి నొప్పితో బాధపడేవారు ఇంగువ నీ కొంచం తీసుకుని దానికి కొంచం నిమ్మరసం కలిపి ఒక మెత్తటి దూది తో నొప్పి ఉన్న పన్ను కి అంటించాలి ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.
  8. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో బాధపడుతున్న వారు ఇంగువ నీ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES