Kukkuta Sastram : కుక్కుట శాస్త్రం
మనుషులకి పంచాంగ శాస్త్రం ఉన్నట్టుగా కోళ్లకి కూడా ఒక ప్రత్యేక పంచాంగ శాస్త్రం ఉంటుందని చాలా మందికి తెలీదు . మీరు వింటుంది నిజమే కోళ్లకు కూడా ఒక ప్రత్యేక పంచాంగం ఉంటుంది. కోళ్లకు కూడా ఉండే ఈ ప్రత్యేక పంచాంగ శాస్త్రం పేరే కుక్కుట శాస్త్రం ( kukkuta sastram). సంక్రాంతి పండుగ రాగానే కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ కోడి పందాలు ఆడే వారికి ఈ కుక్కుట శాస్త్రం గురించి బాగా తెలుసు. ఈ కుక్కుట శాస్త్రం ( kukkuta sastram in telugu ) కోడి పందాలు ఆడే వారికి ఒక ఆయుధం లాంటిది. కోడి పందాలు ఆడే ముందు కోడి పందాలలో పాల్గొనే వారు కచ్చితంగా ఈ కుక్కుట శాస్త్రాన్ని చదువుతారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ లో కోడి పందాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రభుత్వం ఎన్ని సార్లు హెచ్చరించిన మరియు బ్యాన్ చేసిన కోడి పందాల నిర్వాహకులు మాత్రం కోడి పందెం నిర్వహించడం మానడం లేదు. తూర్పు గోదావరి జిల్లా మరియు పచ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు మరియు ఇతర జిల్లాల్లో ఎక్కువగా కోడి పందాలు నిర్వహిస్తారు. ఒక సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాలల్లో కొన్ని కోట్ల రూపాయల మేరకు చేతులు మారతాయి. ఈ కోడి పందాల కోసం కోట్లు కర్చు పెట్టి మరి కోళ్లని పెంచుతారు.
ఈ కోడి పందెం కోసం కోళ్లని లక్షలు పెట్టి కొంటారు. వీటిని పెంచడానికి కూడా చాలా కర్చు అవుతుంది. అంతేకాకుండా పందెం కోసం వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రత్యేక శిక్షణ తర్వాత ఈ కోళ్లను పందానికి తీసుకువెళతారు. ఈ కోడి పందెం కోసం అడపా దడపా కోళ్లను కాకుండా ప్రత్యేకమైన కోళ్లను ఎంచుకుంటారు. పురాణాల ప్రకారం పందెం కోసం కొళ్లని ఎంచుకునే ముందు కుక్కుట శాస్త్రం ప్రకారం ఎంచుకుంటారు. కోడి పుంజుల జాతక వివరాలు అన్ని ఈ కుక్కుట శాస్త్రం లో వివరంగా ఉంటాయి.
సంస్కృతంలో కోడిని కుక్కుట ( kukkuta sastram in telugu ) అంటారు. అలా ఈ పంచంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. ఈ శాస్త్రాన్ని ఎవరు రాశారు అనే సంచారం ఇంత వరకు తెలియలేదు. కానీ పందానికి వెళ్ళే ముందు కచ్చితంగా ఈ కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈ కుక్కుట శాస్త్రం లో కోడి పుంజులను ఎలా పెంచాలి మరియు వాటి వర్గీకరణ , కోడి ఏ నక్షత్రం లో పుట్టింది మరియు వాటి జాతకం ఎంటి అనే మరిన్ని పూర్తి వివరాలు ఈ కుక్కుట శాస్త్రం లో ఉంటుంది. కోడి పుంజుల రకాలు , ఏ కోడి పుంజులను పందెం కి ఎంచుకోవాలి మరియు ఏ సమయంలో కోడి పందెం కాయలో వివరంగా తెలిపారు.
కోడి పందెం కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచుతారు.వాటికి ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోడి పుంజులకి కాళ్ళకి బ్లేడ్ కట్టి పందానికి వదులుతారు. పోటీలో ఉన్న ఎదో ఒక కోడి మరణించే వరకు ఈ పోటీ జరుగుతుంది. సంక్రాంతి పండుగ సమయం లో ఈ కోడి పందెం మూడు రోజులు జరుగుతుంది. ప్రస్తుత కాలంలో కోడి పందాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక , తమిళనాడు మరియు కేరళ ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటాయి.
2015 వ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ కోడి పందాలని నిషేధించింది. కానీ 2016 వ సంవత్సరం లో తెలంగాణ న్యాయ స్థానం కూడా ఈ తీర్పు ని సమర్థించింది. అయినా కూడా కోడి పందాల రాయుళ్లు మాత్రం ఈ కోడి పందాలు నిర్వహించడం మాత్రం మానలేదు. తర్వాత 2018 వ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. పందెంలో పాల్గొనే కోళ్లకు కత్తులు కట్ట కూడదని , ఎలాంటి రక్తపాతం జరగవద్దు అని షరతులు విధించింది.
కోడిపుంజులు రకాలు :
కుక్కుట శాస్త్రం లో కోడిపుంజులను వివిధ రకాలుగా విభజన చేశారు. వాటి ఈకల రంగుని ఆధారంగా చేసుకుని కుక్కుట శాస్త్రం లో కోడిపుంజుల రకాలను , జాతులను చెబుతుంది.
కోడిపుంజు రకాలు | లక్షణాలు |
సేతు | కోడిపుంజు కి తెల్లటి ఈకలు ఉంటాయి |
కాకి | కోడిపుంజు కి నల్లటి ఈకలు ఉంటాయి |
సవల | కోడి మెడపై నల్లటి ఈకలు ఉంటాయి |
పర్ల | కోడి మెడపై నల్లటి మరియు తెల్లటి ఈకలు ఉంటాయి |
కొక్కిరాయి కోడి | కోడి శరీరం నలుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా 2 లేదా 3 ఈకలు మాత్రమె ఉంటాయి |
కౌజు | కోడిపుంజు కి నలుపు, ఎరుపు , పసుపు రంగు ఈకలు ఉంటాయి |
డేగ | కోడిపుంజు కి ఎర్రటి ఈకలు ఉంటాయి |
నెమలి | కోడిపుంజు కి రెక్కల పై మరియు వీపు పై పసుపు రంగు ఈకలు ఉంటాయి |
పింగళ | తెల్లటి రంగు రెక్కల పై నలుపు లేదా గోధుమ రంగు ఈకలు ఉంటాయి |
పూల | కోడిపుంజు కి ప్రతి ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగు ఉంటుంది |
గేరువా | కోడిపుంజు కి తెలుపు మరియు లేత ఎరుపు రంగు ఈకలు ఉంటాయి |
అబ్రాసు | కోడిపుంజుకి లేత బంగారు రంగు ఈకలు ఉంటాయి |
ముంగిస | ముంగిస జూలు రంగు ఈకలు ఉంటాయి |
నల్ల బోర |
కోళ్ళ పై నక్షత్ర ప్రభావం :
నక్షత్రాల ప్రభావం అనేది కేవలం మనుషుల మీదనే కాకుండా జంతువులు మరియు పక్షుల పై కూడా ఉంటుంది. కోడి పందెం జరిగినప్పుడు వాటి నక్షత్రాల ప్రభావం బట్టి ఎ కోడి, ఏ కోడి పై గెలుస్తుందో చాలా స్పష్టంగా కుక్కుట శాస్త్రం లో తెలియజేసారు. క్రింద పట్టికలో తెల్పిన విధంగా ఏ కోడి దేనిపై గెలుస్తుందో వివరంగా తెలుసుకోండి.
నక్షత్రం | గెలుపు | ఓటమి |
భరణి నక్షత్రం | పిచ్చుక రంగు గౌడు | నెమలి , ఎర్రపొడ |
నల్లసవనల | నెమలి ఎరుపు కోడి | |
ఎర్రటి కాకి | కాకి | |
కృత్తిక | ఎర్రటి కాకి | కాకి |
పిచ్చుక రంగు గౌడు | ఏర్రపొడ మరియు నెమలి | |
అశ్విని నక్షత్రం | గౌడు | పింగళి మీద |
కాకి | కోడి | |
నెమలి | డేగ | |
రోహిణి నక్షత్రం | కాకి | ఎర్రగౌడు మరియు కోడి |
పింగళి | ఏర్రకొడి | |
నెమలి | ఏర్రమైల | |
ఆరుద్ర | నల్లపొడ కోడి | ఏర్రపొడ కోడి |
కోడి | వెన్నె పొడ కోడి | |
డేగ | పసిమి కాకి | |
కాకి | నెమలి , పింగళి, నల్లమైల మీద | |
డేగ | కాకి | |
మృగశిర | ఎర్రటి రంగు డేగ | ముంగిస |
కోడి | డేగ మరియు నెమలి | |
పింగళి | కాకి మీద | |
డేగ | పసుపు రంగు కాకి | |
కాకి | డేగ | |
పుష్య | కాకి | కోడి |
పసిమి కాకి | నల్ల కాకి | |
కోడి | నెమలి | |
పింగళి | నెమలి మరియు డేగ | |
కాకి | పింగళి | |
పునర్వాస నక్షత్రం | పిచ్చుక కలర్ గౌడు | ఏర్రకొడి మరియు నల్లబొర |
నెమలి | డేగ | |
సుద్ద కాకి | కోడి | |
కాకి | కోడి | |
మాఘ నక్షత్రం | కోడి | పింగళి మీద |
డేగ | నెమలి మీద | |
పసుపు కలర్ కాకి | డేగ | |
ఎరుపు రంగు నెమలి | నలుపు రంగు డేగ | |
కోడి | గోధుమ కలర్ డేగ | |
పుబ్బ , పుర్వ ఫల్గుణి నక్షత్రము | పింగళి | మూడు డేగల మీద గెలుపు |
నెమలి | కోడి మరియు పింగళి | |
కాకి | కోడి , డేగ మరియు నెమలి | |
అశ్లెష నక్షత్రం | ఎరుపు రంగు కోడి | నల్లబోర |
కాకి | పిచ్చుక కలర్ కోడి | |
పసుపు కలర్ కాకి | డేగ | |
పింగళి | తుమ్మెద కలర్ కాకి | |
నెమలి | డేగ | |
ఉత్తర ఫాల్గుని నక్షత్రం | కోడి | నెమలి మీద |
కాకి | పింగళి , డేగ మరియు కోడి | |
గోధుమ కలర్ డేగ | నలుపు రంగు డేగ | |
చిత్త నక్షత్రము | కోడి | డేగ |
కాకి | కోడి | |
ఏర్రపొడి కోడి | పిచ్చుక కలర్ గౌడు | |
నెమలి | కాకి మరియు ఏర్రపొడి | |
హస్త నక్షత్రం | పసుపు కలర్ కోడి | నెమలి మీద |
డేగ | పింగళి | |
నెమలి | ఏర్రపోడి కోడి | |
పింగళి | నెమలి | |
డేగ | నల్లమైల | |
స్వాతి నక్షత్రం | పసుపు కలర్ కోడి | శుద్ధకాకి |
నెమలి | డేగ | |
నల్ల డేగ | తెలుపు రంగు డేగ | |
పసుపు కలర్ కాకి | నలుపు పొడ కోడి | |
పింగళి | శుద్ధ కాకి మరియు ఎర్ర గౌడు | |
విశాఖ నక్షత్రము | కోడి | నెమలి , పింగళి, డేగ, కాకి |
ఎర్రటి నెమలి | పింగళి | |
పసుపు కలర్ కోడి | డేగ | |
ఎరుపు కలర్ గౌడు | శుద్ధ మైల | |
అనురాధ నక్షత్రం | కాకి | నల్ల మైల మరియు నెమలి |
నెమలి | కోడి | |
మూల నక్షత్రం | నల్ల సవల | కోడి మీద |
నలుపు కలర్ కాకి | పసుపు కలర్ కాకి | |
నెమలి రంగు గౌడు | నలుపు కలర్ కాకి మరియు ఏర్రపొడ కోడి | |
కాకి | గోధుమ కలర్ డేగ | |
జేష్ట్యా నక్షత్రం | పింగళి | డేగ మరియు కోడి |
ఇటుక కలర్ పింగళి | కోడి మరియు నెమలి మీద | |
పసుపు కలర్ కాకి | శుద్ధ కాకి | |
పిచ్చుక కలర్ గౌడు | డేగ | |
ఉత్తరాషాఢ నక్షత్రము | నెమలి కలర్ గౌడు | నల్ల మెడ గల ఎరుపు రంగు కోడి |
డేగ | కాకి | |
పూర్వాషాఢ నక్షత్రము | డేగ | నెమలి మీద |
పసుపు కలర్ కాకి | తుమ్మెద కలర్ కాకి మీద | |
శ్రావణ నక్షత్రం | తెలుపు రంగు నెమలి | నల్ల నెమలి |
కోడి | కాకి , డేగ మరియు పింగళి | |
గోధుమ కలర్ డేగ | కాకి | |
శతబిష నక్షత్రం | పసుపు కలర్ డేగ | నల్ల పొడ కోడి |
కోడి | కాకి | |
తెలుపు కలర్ నెమలి | శుద్ధ కాకి మరియు శుద్ధ డేగ మీద | |
ధనిష్ఠ నక్షత్రం | కోడి | నల్ల పొడ కోడి మరియు పసుపు కలర్ డేగ |
నెమలి వన్నె కాకి | కోడి , ఎరుపు కలర్ కాకి | |
ఉత్తరభద్ర నక్షత్రము | డేగ | కాకి మరియు నెమలి |
పింగళి | నెమలి మరియు కాకి | |
నెమలి | కోడి , కాకి మీద | |
పూర్వభద్ర నక్షత్రం | కోడి | పసుపు కలర్ కాకి మరియు నెమలి |
రేవతి నక్షత్రం | నెమలి | డేగ మరియు కోడి మీద |
పసుపు కలర్ కోడి | డేగ మరియు పింగళి | |
కాకి | డేగ మరియు పింగళి | |
కోడి | డేగ మీద | |
పింగళి వన్నె గౌడు | కోడి |
కోడి పందెం జరిగేటప్పుడు కోడిని పోటీలో ఎలా వదలాలి మరియు ఏ దిశలో వదలాలో క్లుప్తంగా ఈ కుక్కుట శాస్త్రం లో తెలిపారు. కోడి పందెం జరిగేటపపుడు మనం కోడిని వదిలే దిశను బట్టి కూడా గెలుపోటములు నిర్ణయించబడతాయి. ఈ కుక్కుట శాస్త్రాన్ని గనుక మీరు ఫాలో అయితే గెలుపు కచ్చితంగా మీదే అవుతుంది.
ఆదివారం మరియు శుక్రవారం : ఉత్తర దిశలో
సోమవారం మరియు శనివారం : దక్షిణ దిశలో
మంగళ వారం : తూర్పు దిశలో
బుధవారం మరియు గురువారం : పడమర దిశలో