HomedevotionalKukkuta Sastram 2026 : కుక్కుట శాస్త్రం

Kukkuta Sastram 2026 : కుక్కుట శాస్త్రం

Kukkuta sastram 2026 :

కుక్కుట శాస్త్రం ( kukkuta Sastram 2026 ) ద్వారా కోడి పందాల్లో కోళ్లు గెలుపు ఓటములు ఉంటాయి అని చాలా మంది నమ్ముతుంటారు. కోడి పందాల్లో పాల్గొనే వారికి ఈ కుక్కుట శాస్త్రం గురించి బాగా తెలుసు. అందుకే కోడి పందాల్లో పాల్గొనే వారు దీన్ని కచ్చితంగా చదువుతారు. ఈ కుక్కుట శాస్త్రం లో ఉన్నట్టే చేస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రాలో కోడి పందాలు మొదలు అవుతాయి. గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేసిన కూడా ఇంకా చాలా మంది చాటుగా వీటిని నిర్వహిస్తూనే ఉంటారు.

ఎందుకంటే పూర్వ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ కోడి పందాలు నిర్వహించడం చాలా కామన్. అంతేకాకుండా ఈ వారం రోజులు జరిగే కోడి పందాల్లో చాలా మంది వాళ్ళ ఆస్తులు కూడా పోగొట్టుకుంటారు. ఇలాంటివి వాళ్ళకు సర్వసాధారణం. దీని వల్ల మూగ జీవాలు మరణించడమే కాకుండా ( kukkuta Sastram telugu ) చాలా మంది జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇక మీద అయిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే మంచిది లేకుంటే చాలా నష్ట పోయే ప్రమాదం ఉంది.

ఈ కోడి పందాల్లో కోళ్ల యొక్క రంగు బట్టి కూడా గెలుపు ఓటములు ఉంటాయి అని తెలపబడి ఉంటుంది. మనుషులకి ఎలా అయితే జాతకం ఉంటుందో కోళ్లకు కూడా జాతకం ఉంటది అదే ఈ కుక్కుట శాస్త్రం ( kukkuta Sastram 2026 ) . దిన్ని ఎవరు రచించారో ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. కానీ దీన్ని చాలా మంది అనుసరిస్తుంటారు. ఈ కుక్కుట శాస్త్రం నీ అనుసరించి కోళ్ల పెంపకం చేస్తే గెలుపు కచ్చితంగా ఉంటుంది అని నమ్ముతారు. ఈ కుక్కుట శాస్త్రం లో కోడి పుంజుల రకం , రంగు మరియు వాటి జన్మ నక్షత్రం గురించి క్లుప్తంగా ఈ శాస్త్రం లో ఉంటుంది.

పందెం కోళ్లలో నెమలి, కాకి, సేతు, పర్ల , డేగ , మైల, పూల, కొక్కిరాయి, సవల, పింగళ, నల్ల బోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువా ఇలా కోడి రంగు బట్టి పందెం కోళ్ల రంగు విభజించబడ్డాయి. కోడి రంగు బట్టి నే కాకుండా అవి పుట్టిన నక్షత్రం బట్టి కూడా వీటిని విభజించారు. అంతేకాకుండా ఏ రోజున ఏ దిశలో కోడిని పందెం లో వదలాలి అని కూడా ఈ కుక్కుట శాస్త్రం లో నిక్షిప్తం చేసి ఉంది. సంక్రాంతి పండగ రోజున పందేలో పాల్గొనే కోళ్లను అవి పుట్టిన నక్షత్రం , రంగు, జాతిని ఎంపిక చేసుకుని మరీ పందాలు వేస్తారు.

కోడి పుంజుల రకాలు : kukkuta Sastram in telugu

కోడి పుంజుల ఈకల రంగును ఆధారం చేసుకుని కుక్కుట శాస్త్రం లో కోడి పుంజుల రకాలు మరియు జాతులను విభజించారు.
ఈ క్రింద తెలిపిన విధంగా వివిధ రకాలుగా విభజించారు.

Kukkuta Sastram

కోడి పుంజులపై నక్షత్రం ప్రభావం : kukkuta Sastram book

కోడి పుంజుల గెలుపు ఓటములు పై నక్షత్రం కూడా ఆధారపడి ఉంటుంది. కుక్కుట శాస్త్రం లో ఈ క్రింద తెలిపిన విధంగా ఎ కోడి ఎ కోడి పై గెలుస్తుంది అనేది వివరంగా తెలియజేశారు.

Kukkuta Sastram telugu
Kukkuta Sastram 2026
Kukkuta Sastram book

ఏ రోజున ఏ దిక్కున కోడి పుంజులనీ పందెం లో వదలాలి అనేది ఈ కుక్కుట శాస్త్రంలో నిక్షిప్తం చేసి ఉంది.

ఈ క్రింద తెలిపిన విధంగా మీ కోడిని పందెం లో వదలండి.

సోమవారం మరియు శనివారం : దక్షిణ దిశలో

మంగళవారం : తూర్పు దిశలో

బుధవారం మరియు గురువారం : పడమర దిశలో

ఆదివారం మరియు శుక్రవారం : ఉత్తర దిశలో

కోడి పుంజుల పై జీర్ణ శక్తి కూడా ప్రభావితం చూపిస్తుంది. జీర్ణ శక్తి కొరవడితే పందెంలో ఆ కోడి ఓడిపోతుంది. కృష్ణ పక్షం లో ఈ రోజులో ఏ కోడి జీర్ణ శక్తి కొరవడుతుందో ఈ క్రింద పట్టికను చూడండి.

ఆదివారం : కాకి
సోమవారం : నెమలి
మంగళవారం : డేగ
బుధవారం : నెమలి
గురువారం : కోడి
శుక్రవారం : నెమలి
శనివారం : కోడి

RELATED ARTICLES
LATEST ARTICLES