Konda pindi aaku :
ప్రస్తుతం మారుతున్న జీవన విధానం లో చాలా మంది అనారోగ్యాలపాలు అవుతున్నారు. ఎక్కువగా చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. మీ అందరికీ తెలుసు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడం అంత సులభం ఏం కాదు. ఒక కిడ్నీ సంబంధిత వ్యాధి తో మాత్రమే కాకుండా చాలా మంది మూత్రం సరిగా రాకపోవడం మరియు కిడ్నీ లో రాళ్లు మరియు మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వ్యాధులను ఎదుర్కోవడం చాలా కష్టం.
కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి ఉంటది. కొందరు ఆపరేషన్ పెయిన్ భరించలేరు. అలాంటి వారు ఆయుర్వేద వైద్యులనీ సంప్రదిస్తున్నారు. కానీ ఆయుర్వేదం లో ఇలాంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకి చాలా మూలికలు ( మందులు ) మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని మూలికలు మనకు నిత్యం పంట చెన్లల్లో , పొలం దగ్గర కనిపిస్తుంటాయి. అలాంటి నిత్యం కనిపించే మొక్కల్లో ఒక్కటి కొండ పిండి ఆకు ( konda pindi aaku powder ). ఈ ఆకు మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

కొండ పిండి ఆకుతో కిడ్నీ సంబంధిత వ్యాధులకి మాత్రమే కాకుండా వివిధ రకాల వ్యాధులకి కూడా వాడతారు. కొండ పిండి ఆకుని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. ఈ ఆకుని తినడం వల్ల కిడ్నీ లో రాళ్లు కరిగి పోవడమే కాకుండా , మూత్రం సరిగా రాకపోవడం వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. అందుకే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ కొండ పిండి ఆకుని తీసుకుంటారు.
కొండ పిండి ఆకు యొక్క ఉపయోగాలు : konda pindi aaku benefits
- కొండ పిండి ఆకుతో ( konda pindi aaku in telugu ) కిడ్నీ లో ఉన్న రాళ్ళని తగ్గించడం లో కొండ పిండి ఆకు బాగా ఉపయోగపడుతుంది.
- కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్ లని కూడా ఈ కొండ పిండి ఆకు తగ్గిస్తుంది.
- యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కొంత మంది కి మూత్రం విసర్జెంచటపుడు నొప్పి వస్తుంది. ఈ ఆకు తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిస్తుంది.
- కొండ పిండి ఆకు రక్త మొలలు మరియు ఉబ్బసం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
- వీర్య దోషాలు వంటి సమస్యల తో బాధపడుతున్న వారు ఈ ఆకు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.