HomeHealthGond katira : గోండ్ కటీరా తో ఆరోగ్య ప్రయోజనాలు

Gond katira : గోండ్ కటీరా తో ఆరోగ్య ప్రయోజనాలు

Gond katira :

గోండు కటిర ( gond katira ) ఈ పేరుని వేసవిలో చాలా మంది వింటూ ఉంటారు ఎందుకుంటే చాలా మంది దీనిని వేసవిలో శరీరంలో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి వాడతారు. గోండు కఠోర ఇది చూడడానికి గమ్ము లా కనిపిస్తుంది. ఇది ఒక చెట్టు నుండి వచ్చే గమ్ము కానీ ఇది తినగలిగే గమ్ము దీని వలన కలిగే ప్రయోజనాలు అనేకం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పూర్వం దీనిని ఆయుర్వేద వైద్యలలో ఎక్కువ వాడేవారని కూడా ఆయుర్వేదం చెబుతోంది.

ఇందులో రెండు రకాల కఠోర లు ఉంటాయి ఒకటి కఠోర ఇది శరీరాన్ని వేడి చేయడానికి చలి కాలంలో ఉపయోగ పడితే రెండవది గోండు కఠోర ఇది వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఒక వంద గ్రాముల గోండు కఠోర లో ( gond katira in telugu ) అధిక శాతం ఫైబర్ ను కలిగి ఉంటుంది. దీనిని వాడుకునే ముందు నీటిలో నానబెట్టి వాడుకుంటారు.

Gond katira benefits

Gond katira benefits :

ఈ గోండు కఠోర కేవలం శరీర వేడిని తగ్గించడమే కాకుండా మరెన్నో రకాల ప్రయోజనాలు కలిగి ఉంది అందులో కొన్ని

మూత్రపిండాల సంరక్షణ : గోండు కఠోర రోజు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా మరియు కిడ్నీలు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ గోండు కఠోర ఉపయోగపడుతుంది.

జీర్ణ వ్యవస్థ: ఈ గోండు కఠోర లో అధిక శాతం ఫైబర్ ఉండడం వలన అది జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయడానికి ఎంతో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కాబట్టి గోండు కఠోర రోజు తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ సంబధిత రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్: గోండు కఠోర నీళ్లు రోజు తీసుకోవడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారికి తొందరగా ఉపశమనం లభిస్తుందాని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

మలబద్ధకం: మలబద్దంతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ గోండు కఠోర నీటిని రోజు తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకం దూరమవుతుంది. అంతే కాదు ఇది కడుపులోని మంచి బాక్టీరియా ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

శరీర వేడి: చాలా మంది వేసవి రాగానే శరీర వేడి తో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ గోండు కఠోర నీళ్లు శరీరం చల్ల బరిచే లాగ ఉపయోగపడుతాయి. దీనిని వేసవిలో రోజు తీసుకోవడం వల్ల కేవలం వేడికే కాకుండా చాలా రకాలుగా శరీరానికి మేలు చేస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES