Rocket leaves :
రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్య ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. రక్త నాళాల్లో రక్తం సరిగా సరఫరా కాకుంటే శరీర అవయవాలకు రక్తం సరఫరా అవ్వదు. రక్తం సరఫరా కాకుంటే శరీర అవయవాలు పనితీరు దెబ్బతింటుంది. ఒకవేళ ఊపిరితిత్తులకి కానీ లేదా గుండె కి గానీ రక్త సరఫరా అవ్వకుంటే గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీని వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.
ఒకవేళ మెదడులో గనుక రక్త నాళాల్లో రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ పనితీరు తగ్గడమే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేరాలసిస్ బ్యాచ్ అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధుల బారిన పడుకుంటే ఉండాలి అంటే రాకెట్ లీఫ్ ( rocket leaf ) తీసుకోవడం మంచిది. రోజు డైట్ లో రాకెట్ లీఫ్ నీ తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం సమస్య తగ్గుతుంది. ఎక్కువగా రాకెట్ లీఫ్ నీ సలాడ్స్ లో తీసుకుంటారు. ఈ ఆకుని ఎలిజబెతన్ కాలం నుంచి ఎక్కువగా ఆహారం లో తీసుకుంటున్నారు.

రాకెట్ లీఫ్ నీ ( rocket leaves in telugu ) తీసుకోవడం శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాకెట్ లీఫ్ నీ రుకోలా లేదా అరుగుల అని కూడా పిలుస్తారు. రాకెట్ లీఫ్ నీ సలాడ్స్ మరియు పిస్తా లేదా ఫిజా పైన గార్నిష్ చేసి తీసుకుంటారు. ఈ రాకెట్ లీఫ్ ఎక్కువగా నిల్వ ఉండాలి అంటే ఫ్రెష్ గా ఫ్రిజ్ లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాకెట్ లీఫ్ మామూలుగా రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిజ్ లో పెట్టండి.
రాకెట్ లీఫ్ యొక్క ఉపయోగాలు : rocket leaves benefits
- రాకెట్ లీఫ్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొంచెం తిన్న కడుపు నిండినట్టుగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు రోజు డైట్ లో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
- రాకెట్ లీఫ్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- రాకెట్ లీఫ్ జ్యూస్ ను రోజు ప్రొద్దున తీసుకోవడం వల్ల బాడీ డిటాక్సిఫై అవుతుంది .
- రాకెట్ లీఫ్ శరీరం లో క్యాన్సర్ కణాల పెరుగుదల నీ తగ్గిస్తుంది. ఇది శరీరం లో నీ ప్రీ రాడికల్స్ పై పోరాటం చేస్తాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
- రాకెట్ లీఫ్ లో పొటాషియం, కాల్షియం మరియు ఫోలేట్ వంటి శరీరానికి కావలసిన మినరల్స్ ఉంటాయి.
- రాకెట్ లీఫ్ లో విటమిన్ కె మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది బోన్ పెరుగుదల కి ఎంత గానో ఉపయోగపడుతుంది.
- రాకెట్ లీఫ్ లో లుటీన్ మరియు జాక్సన్తీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.