kiwi fruit in telugu :
మనం తినే అన్ని పళ్లలో కన్న కివీ పండులో చాలా పోషక విలువలు ఉంటాయి. కివీ పండును పళ్లలో రారాజు అని పిలుస్తారు. కివీ పండు చూడటానికి చిన్నగా కోడి గుడ్డు ఆకారంలో మరియు సపోటా పండులా ఉంటుంది. కివీ పండు లోపలి భాగం ఆకుపచ్చని రంగు గుజ్జుతో మరియు నల్లటి రంగు లో చాలా విత్తనాలను కలిగివుంటుంది. కొన్ని చోట్లలో కివీ పండుని ” వండర్ ఫ్రూట్ ” ( kiwi fruit in telugu ) అని పిలుస్తారు. కివీ పండు ని ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలో , ఆస్ట్రేలియా మరియు చైనా దేశం లో పండిస్తారు. ప్రపంచంలో ఎక్కువగా కివీ పండు ని చైనా ఎగుమతి లో మొదటి స్థానంలో ఉండగా మరియు న్యూజిలాండ్ , చిలి , ఇటలీ తర్వాత స్థానం లో ఉన్నాయి. కివీ పండు ని చైనీస్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు.
కివీ పండు ఎక్కువగా చల్లని ప్రదేశం లో పండుతుంది. మన దేశం లో కివీ పండు సాగు అంత పెద్దగా ఏం లేదు. మన దేశం కివీ పండు ని ఎక్కువగా చైనా మరియు న్యూజిలాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. కివీ పండుకి మార్కెట్ లో మంచి గిరాకి ఉంటుంది. కివీ పండు ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ధర ఇతర పండ్లతో పోలిస్తే చాలా ఎక్కువ కాబట్టి కివీ పండు ని కొనడానికి కొంత మంది ఆలోచిస్తుంటారు. కానీ కివీ పండు లో చాలా పోషక విలువలు ఉండటం వల్ల వైద్యులు కూడా కివీ పండు ని తినమని చెబుతుంటారు. కివీ పండు రుచి కొంచం పుల్లగా , వోగరు గా ఉంటుంది.
కివీ పండుని ఎక్కువగా మన దేశంలో డెంగ్యూ జ్వరం వచ్చినపుడు తినడం మొదలు పెట్టారు. ఎందుకంటే డెంగ్యూ జ్వరం వచ్చినపుడు మన శరీరంలోని ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుంది. కివీ పండు కి శరీరం లో ప్లేట్లెట్ సంఖ్య పెంచే గుణం ఉంది కాబట్టి వైద్యులు సైతం డెంగ్యూ జ్వరం వచ్చినపుడు కివీ పండు ని తినమని చెబుతుంటారు.కివీ పండు లో నారింజ మరియు నిమ్మకాయల కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది.షుగర్ వ్యాధి తో బాధపడుతున్నవారు ఈ కివీ ఫ్రూట్ ని తింటే రక్తం లోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. దీంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కివీ పండులో పోషక విలువలు : Neutrients values in kiwi fruit in telugu
కివీ పండులో చాలా అధికంగా పోషక విలువలు ఉంటాయి. కివీ పండులో కాల్షియమ్, మెగ్నీషియం, పొటాషియం , విటమిన్స్ మరియు ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా యాంటి ఆక్సిడెంట్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు కూడా కివీ పండులో వుంటాయి. కివీ పండులో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కివీ పండు రోజు తినడం వల్ల కొల్లాజెన్ ని పెంచుతుంది. ఇది మన చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా చేస్తుంది.
కివీ పండు తినడం వల్ల కలిగే ఉపయోగాలు : Health benefits of Kiwi fruit in telugu
1.జీర్ణ క్రియ :
కివీ పండులో అధికంగా డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఫైబర్ మలబద్దక సమస్యను మరియు ఇతర జీర్ణ క్రియ వ్యవస్థ కి సంబంధించిన సమస్యలని తగ్గిస్తుంది. జీర్ణ క్రియ ని సాఫీగా జరిగేలా చేస్తుంది.
2.ఆస్తమా చికిత్స :
ఆస్తమా వ్యాధి ఉన్నవారు ఎక్కువగా గురక సమస్య తో బాధపడుతుంటారు. కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.కాబట్టి గురక సమస్యని తగ్గిస్తుంది.
3.కంటి ఆరోగ్యం :
కివీ పండులో యాంటి ఆక్సిడెంట్స్ మరియు కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి.కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.
4.గుండె ఆరోగ్యం :
కివీ పండుకి రక్త పోటుని తగ్గించే గుణం ఉంటుంది. కివీ పండులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్ట్రోక్ మరియు గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కివీ పండులో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. కాబట్టి డైటరీ ఫైబర్స్ శరీరం లో LDL cholesterol చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి మరియు గుండె సంబంధిత వ్యాధులు రాకుండ కాపాడుతుంది.
5.రోగ నిరోధకశక్తి :
కివీ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.కాబట్టి ఇది మన శరీరములో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
6.కివీ పండు రోజు తినడం వల్ల శరీరంలో రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
7.కివీ పండులో ఐనోసిటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనోవ్యాకులత చికిత్సకి ఉపయోగపడుతుంది.
8.కివీ పండు జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.