HomeMovie ReviewsAvatar the way of water movie review

Avatar the way of water movie review

avatar the way of water movie review :

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ( Avatar the way of water movie review ) ఈ రోజు డిసెంబర్ 16 న రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో ఈ సినీమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాని జేమ్స్ కామెరూన్ దాదాపుగా నిర్మించడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉండబోతుందో. అంతేకాకుండా 2009 వ సంవత్సరం లో విడుదలైన అవతార్ సినిమా ప్రపంచ రికార్డులనే తిరగరాసింది. దాదాపుగా అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా $2.9 బిలియన్ల కలెక్షన్స్ ని సాధించింది. ప్రపంచంలో అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాలో అవతార్ ప్రథమ స్థానంలో ( Avatar the way of water movie review ) నిలిచింది. ఈ రోజు విడుదల అవుతున్న అవతార్ 2 సినిమా మొదటి పార్ట్ అయిన అవతార్ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అవతార్ 2 సినిమా మన దేశం లో తమిళ్ , కన్నడ , హిందీ , తెలుగు , మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 సినిమా 160 వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంది. అవతార్ 2 సినిమా కోసం ప్రేక్షకులు దాదాపుగా 12 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన అవతార్ 2 ( avatar 2 ) ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. జేమ్స్ కామెరూన్ అవతార్ 2 ఈ సంవత్సరంలో విడుదలకు సిద్ధం చేశారు. అంతేకాకుండా అవతార్ 3 ( avatar 3 ) సినిమా ని డిసెంబర్ 20 , 2024 న మరియు అవతార్ 4 ( avatar 4 ) ని డిసెంబర్ 18 , 2026 న మరియు అవతార్ 5 ( avatar 5 ) సినిమా డిసెంబర్ 22 , 2018 సంవత్సరం లో వస్తుంది. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా ని జోస్ లండౌ తో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి రిక్ జఫ్ఫా మరియు అమాండ రైటర్ గా పని చేశారు. ఈ సినిమాలో సామ్ , జో సల్దనా , స్టీఫెన్ లాంగ్, ఫౌండర్ మరియు దిలీప్ రావ్ తది తరులు నటించారు. ఈ సినిమాకి సైమన్ ఫ్రాంగ్లెన్ మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమాని లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ మరియు TSG ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు.

Avatar the way of water

కథ : Avatar the way of water movie review

అవతార్ మొదటి భాగం లాస్ట్ లో ఆర్మీ కి మరియు పాండొర గ్రహంలో ఉన్న అవతార్ లకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో హీరో అవతార్ ల వైపు ఉంటాడు. ఈ యుద్ధంలో చివరికి అవతార్ లు గెలుస్తారు. హీరో అప్పటికే హీరోయిన్ తో ప్రేమలో ఉంటాడు. హీరో కూడా అవతార్ లా మారిపోయి తాను అక్కడే వాళ్ళతో జీవిస్తాడు. ఇది అవతార్ సినిమా మొదటి భాగం. అవతార్ 2 సినిమాలో హీరో జెక్ కి మరియు హీరోయిన్ నేతిరి కి నెటెయమ్, లొక్ కొడుకులు మరియు టక్ అనే కూతురు మరియు కిరి అనే పెంపుడు కూతురు ఉంటారు. వీరితో పాటుగా మానవ బాలుడు పాటి స్పైడర్ ఉంటాడు. మొదటి భాగం పండోర ని ఆక్రమించుకునే ధ్యేయంగా పెట్టుకున్న మైల్స్ క్వారిచ్ కొడుకే పాటీ స్పైడర్. స్పైడర్ ని భూలోకానికి పంపడానికి సరైన సాధనం లేకపోవడం వల్ల స్పైడర్ హీరో జెక్ తో ఉండిపోతాడు. మళ్ళీ భూ గ్రహం నుంచి పండోర గ్రహంపై దండెత్తుత్తారు. వారికి నాయకుడిగా క్వారిచ్ వస్తాడు. తర్వాత జేక్ గెరిల్లా దాడికి సిద్ధం అవుతాడు.

క్వారిచ్ మనుషులు జేక్ పిల్లల్ని బంధిస్తాడు. తర్వాత జేక్ దగ్గర ఉన్న స్పైడర్ తన కొడుకే అన్న నిజం క్వారిచ్ కి తెలుస్తుంది. క్వారిచ్ తన కొడుకు స్పైడర్ ని తీసుకెళ్లడం మరియు జేక్ ని మట్టుపెట్టడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటాడు. జేక్ తన పిల్లల్ని విడిపించుకుని మెట్కయినా ప్రాంతానికి వెళతాడు.మెట్కయినా ప్రాంతాన్ని టోనోవరి మరియు అతడి భార్య రోనాల్ పరిపాలిస్తుంటారు. మెట్కయినా ప్రాంతానికి వెళ్ళాక జేక్ కొడుకు లోక్ ఆ ప్రాంత నాయకుడి కూతురు సిరేయాతో సన్నిహితంగా ఉంటాడు. ఇలా ఉండటం సిరేయా అన్న ఒనంగ్ కి నచ్చదు. అయితే ఒనంగ్ అసూయతో లోక్ ని తీసుకెళ్ళి భయంకర జలచరాలు ఉండే చోట పడేస్తాడు. లోక్ ని పాయకన్ అనే జలచరం రక్షిస్తుంది. క్వారిచ్, జేక్ ని చంపేయాలని అనుకుంటాడు ఈ విషయం క్వారిచ్ కొడుకు స్పైడర్ కి నచ్చదు. తన కొడుకే తనపై వ్యతిరేకంగా ఉన్న విషయం క్వారిచ్ కి తెలియడం తో స్పైడర్ తన కొడుకు కాదని భావిస్తాడు. కానీ స్పైడర్ , క్వారిచ్ కొడుకే అని నేతిరి రుజువు చేస్తుంది. చివరికి క్వారిచ్ , జేక్ ని ఏం చేస్తాడు ? లోక్ కోసం మళ్ళీ ఓనంగ్ వస్తాడా ? అన్న విషయం మీరు తెలుసుకోవాలంటే సినిమా ని థియేటర్స్ లో చూడాల్సిందే.

టెక్నికల్ వాల్యూస్ :

అవతార్ 2 సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటే మనం కూడా ఆ గ్రహంలో ఉన్నామా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ప్రపంచంలో మళ్లీ ఇలాంటి సినిమా వస్తుందా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. పండోర గ్రహం పై అండర్ వాటర్ సీన్స్ జేమ్స్ కామెరూన్ చాలా చక్కగా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా లో పాత తెలుగు జానపద కథలు కనిపిస్తాయి. ఈ సినిమాకి మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా అందించారు. అంతే కాకుండా ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ సినిమా నడివిడి మూడు గంటలకి పైగా ఉన్న కూడా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి .

ప్లస్ పాయింట్స్ :

విజువల్ ఎఫెక్ట్స్
స్టోరీ
టైటానిక్ తార కేట్ విన్స్లెట్
మేకింగ్ వాల్యూస్
నటీనటుల ఆక్టింగ్

మైనస్ పాయింట్స్ :

సినిమా నడివిడి
ఫస్ట్ హాఫ్

మూవీ రేటింగ్ : 4.5/5

RELATED ARTICLES
LATEST ARTICLES