HomeMovie ReviewsKushi Movie Review : విజయ్ దేవర కొండ ఖుషీ సినిమా రివ్యూ & రేటింగ్

Kushi Movie Review : విజయ్ దేవర కొండ ఖుషీ సినిమా రివ్యూ & రేటింగ్

Kushi Movie Review :

విజయ్ దేవర కొండ నటించిన ” ఖుషీ ” ( Kushi Movie Review ) సినిమా ఈరోజు సెప్టెంబర్ 1 వ తేదీన భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయ్యింది. విజయ్ దేవర కొండ ఈ ఖుషీ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ మద్యే రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం తో విజయ్ దేవర కొండ కెరీర్ పై కొంత ఎఫెక్ట్ పడింది. అందుకే ఈ సినిమా హిట్ అయితే విజయ్ కెరీర్ మళ్ళీ పుంజుకున్నట్లే. ఈ సినిమాలో ( kushi movie review in telugu ) సమంత విజయ్ దేవర కొండ సరసన నటిస్తుంది. సమంత విజయ్ దేవర కొండతో నటించడం ఇది రెండవ సారి. మొదటి సారి వీళ్ళు ఇద్దరు కలిసి మహానటి సినిమా లో నటించారు.మహానటి సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించారు. ఈ సినిమా మంచి హిట్ ని సాధించింది. ఈ సినిమా విడుదలకి ముందే రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.

ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ( kushi movie review in telugu ) ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ని చూసాక కొందరు ఇది అచ్చం సమంత నిజ జీవితం లాగే ఉంది అని కామెంట్స్ కూడా చేశారు. ఈ సినిమా ని శివ నిర్వాన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సచిన్ ఖేదేకర్ , శరణ్య, మురళి శర్మ , లక్ష్మీ, రోహిని, వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ, అలి మరియు శ్రీకాంత్ తది తరులు నటించారు. ఈ సినిమాకి హేశం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ని అందించారు. కుషీ సినిమాకి ఎడిటర్ గా ప్రవీణ్ , సినిమాటోగ్రాఫర్ గా మురళి పనిచేశారు. ఈ సినిమాని నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు.

కథ : Kushi Movie story

ఈ ఖుషీ సినిమా ( kushi movie review ) కథ మొదటగా కాశ్మీర్ లో మొదలు అవుతుంది. కాశ్మీర్ మొదటగా విజయ దేవర కొండ ( విప్లవ్ ), సమంత ( భేగం ) ని చూస్తాడు. చూసిన మొదటి చూపులోనే విజయ్ దేవర ( విప్లవ్ ) కొండ సమంత ( భేగం ) తో ప్రేమలో పడిపోతాడు. సమంత ని తన పిల్ల అని ఫిక్స్ అయిపోతారు. కొన్ని పరిస్థితుల కారణంగా సమంత బేగం గా మారాల్సి వస్తుంది. సమంత మరియు విజయ్ దేవర కొండ ప్రేమించి , పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి అమ్మాయి వాళ్ళ నాన్న కి అస్సలు నచ్చదు. ఎందుకంటే వీళ్లది బ్రాహ్మణ కుటుంబం కాబట్టి. వీళ్ళ పెళ్లికి విప్లవ్ వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోడు.

ఎందుకంటే చంద్రరంగం కి వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే కాపురం లో సమస్యలు వస్తాయని , గండం ఉందని విడిపోతారు అని ముందే తనకు తెలుసు. విజయ్ ని హెచ్చరించిన కూడా వినడు. పెళ్లి తర్వాత అందరి కన్నా ప్రపంచంలో మనం సుఖంగా ఉన్నామని నిరూపించాలి అని అనుకొని ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలు అవుతాయి. చంద్ర రంగం అనుకున్నట్టు గానే గొడవలు జరుగుతాయి. వీళ్ళు చివరికి విడిపోతారా..? లేదా గొడవలు సర్ధు మనుగుతాయా… ? తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే … !

పెర్ఫార్మెన్స్ :

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తె విజయ్ దేవర కొండ ఎక్కువగా లవ్ ట్రాక్ సినిమాలో మాత్రమే నటించేవాడు. లవ్ ట్రాక్ సినిమాలు విజయ్ దేవర కొండ కి బాగా కలిసి వచ్చింది. విజయ్ దేవర కొండ నటించిన సినిమాలో దాదాపుగా లైవ్ ట్రాక్ సినిమాలు మాత్రమే హిట్ ని సాధించాయి. విజయ్ దేవర కొండ తన నటన తో అందరినీ మెప్పించాడు. సమంత లవ్ ట్రాక్ సినిమాలలో చాలా బాగా నటిస్తుంది. ఈ సినిమాలో లాస్ట్ 30 నిమిషాల్లో సమంత మరియు విజయ్ దేవర కొండ సెంటిమెంట్ తో ప్రేక్షకులని ఒక్కింత ఏడ్పించారు అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సినిమాలో శరణ్య , సచిన్ , రోహిణి , మురళి శర్మ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

టెక్నికల్ :

దర్శకుడు శివ నిర్వాణ ప్రేమ కథ చిత్రాలని చాలా బాగా ఎమోషనల్ గా తెరకెక్కిస్తారు. మజిలీ సినిమాని కూడా అలాగే తీశారు. మంచి హిట్ ని సాధించాడు. ఈ సినిమాలో కూడా తన ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమా కి కథ ఒక్కింత బలం అయితే దర్శకుడు శివ నిర్వాణ లీడ్ రోల్స్ కి ఎంచుకున్న విధానం కూడా ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ సినిమా ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమా కి మ్యూజిక్ అబ్దుల్ వాహాబ్ చాలా బాగా అందించారు. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ఖుషీ ( kushi song )సాంగ్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యింది. విడుదల కి ముందే ఈ ఒక్క పాటతో సినిమా పై చాలా అంచనాలను పెంచింది.

ప్లస్ పాయింట్స్ : plus points ( Kushi Movie Review and rating )

  • విజయ్ దేవరకొండ నటన
  • సమంత నటన
  • స్టోరీ
  • సాంగ్స్
  • దర్శకత్వం
  • బి జీ యం
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ : minus points

  • సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

విశ్లేషణ :

శివ నిర్వాణ తన దర్శక ప్రతిభ తో విజయ్ దేవర కొండ కి మంచి హిట్ ని ఇచ్చాడు. కథ రొటీన్ గా ఉన్న , సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా చక్కగా తెరకెక్కించాడు. సమంత తన నటన తో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. మొత్తం మీద సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమా పై ట్విట్టర్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ తో ట్వీట్స్ చేశారు. ఈ వీకెండ్ లో ఖుషీ ఎమోషనల్ లవ్ స్టొరీ ని చూసి ఎంజాయ్ చేయండి.

Kushi Movie Rating : 3/5

RELATED ARTICLES
LATEST ARTICLES