HomeHealthBitter gourd in telugu : కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Bitter gourd in telugu : కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Bitter gourd in telugu :

కాకరకాయ ( bitter gourd ) ఈ పేరు వినగానే ఒక్కింత అయిష్టంగా ఉంటారు. రుచి గా లేని ఆహారాన్ని మనం తినడానికి ఇష్టపడము. కాకరకాయ రుచి తినడానికి చాలా చేదుగా ఉంటుంది. రుచి తినడానికి ఎంత చేదుగా ఉంటుందో దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ( Bitter ground benefits ) కూడా అన్నే ఉంటాయి. కాకరకాయ ( Bitter gourd in telugu ) తిన్నా లేదా దాని జ్యూస్ తాగిన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

కాకరకాయ ని ( Bitter gourd curry ) కర్రీ చేసుకుని లేదా పచ్చడి మరియు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. దీని చేదుని తగ్గించడానికి వంటకాలలో కొంచం షుగర్ ని కలుపుతారు. దీని వల్ల కొంచం కాకరకాయ చేదు తగ్గుతుంది. రోజు కాకరకాయ జ్యూస్ ని ( Bitter gourd juice ) ఉదయం పూట తీసుకోవడం వల్ల షుగర్ పేషంట్స్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి.

కాకరకాయ ని ( Bitter gourd in telugu ) మన దేశం లో మరియు ఆఫ్రికన్ దేశం లో ఎక్కువగా తింటారు. చేదుగా ఉన్న సరే దీన్ని తింటారు. ఎవరైతే కాకరకాయ తినడానికి అయిష్టత చూపిస్తారో దీని యొక్క ఉపయోగాలు తెలిసిన తర్వాత కచ్చితంగా కాకరకాయ ని ఎంతో ఇష్టంగా తింటారు. అంతకంటే ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్య కాలంలో కాకరకాయ ని ఎక్కువగా ఫ్రై చేసుకుని తింటున్నారు. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో , దీని యొక్క ఆకులు కూడా అంతే మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

Neutrients values in bitter gourd in telugu; కాకరకాయ లో పోషక విలువలు

కాకరకాయ లో విటమిన్ సి, ఐరన్ , పొటాషియం, జింక్, ఫోలేట్ , పాస్పరస్, మాంగనీస్, కాల్షియం మరియు డైయేటరీ ఫైబర్స్ , బీటా కెరోటిన్ సమృద్దిగా ఉంటాయి. అందుకే కాకరకాయ ని తినమని వైద్యులు సైతం చెబుతుంటారు.

Bitter gourd benefits : కాకరకాయ తో ఆరోగ్య ప్రయోజనాలు

  • కాకరకాయ లో ( bitter gourd ) విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.
  • కాకరకాయ లో రక్తం లో షుగర్ లెవెల్స్ ని తగ్గించే గుణం ఉంటుంది. పూర్వ కాలం నుంచి షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి షుగర్ పేషంట్స్ కాకరకాయ తో చేసిన జ్యూస్ ని ( bitter gourd juice ) తాగుతుంటారు. ఈ కాకరకాయ జ్యూస్ ని పడిగడుపున ఉదయం పూట తాగడం ఎంతో మంచిది . ఆయుర్వేద వైద్యులు కూడా ఈ కాకరకాయ జ్యూస్ ని తాగమని చెబుతుంటారు.
  • కాకరకాయ లో చెడు కొలెస్టరాల్ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్టరాల్ ని తగ్గించి , గుండె ని ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు ని కూడా అదుపులో ఉంచుతుంది.
  • కాకరకాయ లో ( Bitter gourd in telugu ) ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె పోటు రాకుండ చూస్తుంది.
  • కాకరకాయ లో విటమిన్ సి మరియు విటమిన్ ఎ ఉంటుంది. మొహం పై మొటిమలు మరియు మచ్చలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కాకరకాయ డైట్ లో చేర్చుకోవడం వల్ల మొటిమలు మరియు మచ్చల సమస్య తగ్గుతుంది.
  • కాకరకాయ లో ( Bitter gourd in telugu ) ఫోలిక్ ఆసిడ్ , బయోటిన్ , జింక్ , విటమిన్ సి మరియు విటమిన్ ఎ పుష్కలంగ ఉంటాయి. ఇవి మన జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది.
RELATED ARTICLES
LATEST ARTICLES