HomeHealthBenefits of Dates : ఖర్జూరతో అరోగ్య ప్రయోజనాలు

Benefits of Dates : ఖర్జూరతో అరోగ్య ప్రయోజనాలు

Benefits of Dates :

Dates ని తెలుగులో ఖర్జూరం అని పిలుస్తారు. ఖర్జూరం యొక్క శాస్త్రీయ నామం ఫీనిక్స్ డాక్టిలిఫెరా. ఈ కర్జూరం పండు ఫీనిక్స్ జాతికి చెందినది గా గుర్తించబడినది. ఇది ఒక అడవి ఖర్జూరం( kharjura ). అంతే కాదు ఈ జాతి రకం ఇంకా 12 నుండి 19 రకాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఖర్జూరం ఒక తియ్యని రుచి కలిగిన పండు. ప్రపచవ్యాప్తంగా ప్రతి వార్షిక సంత్సరాణికి 8 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువగా ఈ ఖర్జూర పండ్ల మొక్కలు ఆఫ్రికా మరియు ఉత్తర ఆసియాలో సాగు చేస్తారు. ఖర్జూర పండ్లు చెట్టుకి గుత్తులు గా కాస్తాయి. ఈ పండ్లు గోధుమ రంగులో మరియు కాంతి వంతమైన ఎరుపు రంగులో ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా కర్జూర పండ్ల ( benefits of dates ) విలువ రోజు రోజుకి చాలా పెరుగుతుంది.

ఎందుకంటే ఖర్జూరంలో అధిక పోషక విలువలు ఉన్నాయి కాబట్టి. ఖర్జూర పండులో 60 శాతం కార్బోహైడ్రేట్స్ మరియు 0.5 శాతం మంచి కొవ్వులు అంతే కాకుండా 15 రకాల లవణాలు ఖనిజాలు మరియు ప్రోటీన్లు విటమిన్లు ( benefits of dates ) కలిగి ఉంటుంది.ఖర్జూర పండులో 6 నుండి 16 శాతం డైటేరీ ఫైబర్ ఉంటుంది. ఇది తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ ఖర్జూర పండుని ఏండబెట్టి తీసుకున్నపుడు గ్రాము ఖర్జూరం లో 916 శాతం ఖనిజాలు ఉంటాయి. ఖర్జూర పండులో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఖర్జూర పండులో ( benefits of dates ) తక్కువ శాతంలో విటమిన్ సి మరియు విటమిన్ బి1 బి2 బి12 ఉంటాయి.


Benefits of Dates

ఖర్జూర పండు ఉపయోగాలు : Health benefits of Dates ( kharjura)


1.జీర్ణ వ్యవస్థ (good for digestion):
ఖర్జూర పండులో జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి తిన్న ఆహారాన్ని మంచిగా జీర్ణం చేసే గుణం ఉంది. అంతే కాదు రోజు ఆహారాన్ని తీసుకున్నాక ఒక ఖర్జూర పండుని తింటే అజీర్తిని తగ్గిస్తుంది.

2.దంత రక్షణ( good for teeth) :
ఖర్జూర పండులో ఎలిమెంటరీ ఫ్లోరిన్ ఉంటుంది. ఇది పంటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పళ్ళు పాడు కాకుండా చేస్తుంది. కాబట్టి రోజు ఉదయం ఓ మూడు ఖర్జూర పండ్లను తరచూ తినడం వలన పళ్ళ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

3.క్యాన్సర్ (good for cancer):
క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోజు ఉదయం ఖర్జూర పండుని తీసుకుంటే క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త తీసుకోవడానికి రోజు ఉదయం ఖర్జూర పండు తినడం మంచిది. ఎందుకంటే ఖర్జూరం లో అధిక మొత్తంలో సెలీనియం ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ తో పోరాడడానికి ఉపయోగపడుతుంది.

4.రక్త హినత :(reduce Anemia)
ఖర్జూర పండులో రక్త హీనతను పెంచే గుణాలు ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. రక్త హీనత తో బాధపడుతున్న వారికి ఖర్జూర పండు ఎంతో ఉపయోగపడుతుంది. రోజు ఉదయం లేవగానే కొన్ని ఖర్జూర పండ్లను తీసుకుంటే రక్తాన్ని పెంచుతుంది.

5.నరాల వ్యవస్థ (reduce nervous weakness) :
ఖర్జూర పండు నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి చక్కటి మెడిసిన్ గా పనిచేస్తుంది. ఖర్జూరం లో నరాలని వ్యవస్థను పటిష్టం చేసే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

6.ఏముకల బలం (strength for bones) :
ఖర్జూర పండు లో ఏముకల బలాన్ని పెంచడానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. అవి ఎముకలను ధృడంగా ఉండేలా చేసి ఏముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి చిన్న పిల్లలకు రోజు ఖర్జూర పండు ని తినిపిస్తే వారి ఏముకలను బలంగా పెరిగేలా చేస్తుంది. పెద్ద వారు రోజు తీసుకుంటే ఏముకలను బలంగా ఉంచుకోవచ్చు.

7.మధుమేహం ( reduce blood sugar levels):
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఖర్జూర పండు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అలా అని ఖర్జూర పండు ని తరచూ తీసుకోవడం అధికంగా తీసుకోవడం మధుమేహ వ్యాధులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఖర్జూర పండులో అధిక శాతం కార్బోహడ్రేట్లు ఉంటాయి.

8.మతిమరుపు (reduce amnesia ):
ఖర్జూర పండు మెదడు పై చాలా ప్రభావం చూపిస్తుంది. మతి మెరుపుతో మరియు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఖర్జూర పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఖర్జూర పండు మతిమరుపు ని నివారిస్తుంది. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖర్జూర పండుని రోజు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

9.యాంటి ఇన్ఫ్లమేటరీ (anti inflammatory):
ఖర్జూర పండు యాంటి ఇనఫ్లమేటరీ గా పనిచేస్తుంది. ఏలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటితో పోరాడడానికి ఉపయోగపడుతుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES