HomeHealthBaby corn : బేబీ కార్న్ తిని ఆరోగ్యంగా ఉండండి

Baby corn : బేబీ కార్న్ తిని ఆరోగ్యంగా ఉండండి

Baby corn :

బేబీ కార్న్ baby corn అంటే ఇష్టం ఉండని వారు బహుశా ఉండరేమో… ఎందుకంటే బేబి కార్న్ రుచి చాలా తీయ్యగా ఉంటుంది కాబట్టే బేబీ కార్న్ ని తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. బేబీ కార్న్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. బేబీ కార్న్ అంటే విత్తనాలు పూర్తిగా పెద్దగా అవ్వకముందే కార్న్ ని కోస్తారు. ఇది పెద్దగా అవ్వకముందే కోస్తారు కాబట్టి దీని విత్తనాలు చిన్న పరిమాణంలో ఉంటాయి అయిన దీనిలో చాలా పోషక విలువలు ఉంటాయి. బేబీ కార్న్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. బేబీ కార్న్ ని పిల్లలు , పెద్దలు అని వయసు తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటారు. బేబీ కార్న్ ని తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో… ఎక్కువగా తింటే అంతే దుష్ప్రావాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలలో బేబీ కార్న్ ఒకటి.

బేబీ కార్న్ ని సూప్ లు , ఉడికించి లేదా కాల్చి తింటారు. ఎక్కువగా రెస్టారెంట్ లలో బేబీ కార్న్ ని ఎక్కువగా వడ్డిస్తుంటారు. బేబీ కార్న్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకుంటారు. వీటిని కొనుగోలు చేసే ముందే మనం బేబీ కార్న్ ధృడంగా ఉందో లేదో చూసుకోవాలి. వివిధ దేశాల్లో బేబీ కార్న్ తో బేబీ కార్న్ ఫింగర్స్ baby corn fry , బేబీ కార్న్ సలాడ్ crispy baby corn మరియు మంచూరియా baby corn manchurian వంటి వంటకాలను చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ బేబీ కార్న్ ని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Neutrients values in baby corn : బేబీ కార్న్ లో పోషక విలువలు

బేబీ కార్న్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. బేబీ కార్న్ లో థయామిన్ , రిబోఫ్లావిన్ , నియాసిన్ ,విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బేబీ కార్న్ లో పొటాషియం , మెగ్నీషియం , ఐరన్ మెండుగా ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Baby corn benefits : బేబీ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలు

  • బేబీ కార్న్ లో తక్కువ కేలరీలు ఉంటాయి.బేబీ కార్న్ తక్కువ పిండి పదార్థం మరియు తక్కువ కొవ్వుని కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి బేబీ కార్న్ ఉపయోగపడుతుంది. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మీరు బరువు చాలా సులభంగా తగ్గవచ్చు.
  • బేబీ కార్న్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఫైబర్ జీర్ణ క్రియ సరిగా జరిగేలా చేస్తుంది.మరీ ఎక్కువగా తినకుండా మితంగా తింటే బేబీ కార్న్ జీర్ణ క్రియ రేటు ని పెంచుతుంది.
  • బేబీ కార్న్ లో కెరోటినాయిడ్స్ ఉంటుంది. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే బేబీ కార్న్ ని తినండి. బేబీ కార్న్ మీ కంటి చూపు సమస్యలను తీరుస్తుంది. కంటి శుక్లం దెబ్బతినకుండా కాపాడుతుంది.
  • బేబీ కార్న్ లో ఫోలేట్ ఉంటుంది. ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ బర్త్ డిఫెక్ట్స్ ని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • బేబీ కార్న్ ని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. మలబద్దక సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అలాంటివారు బేబీ కార్న్ తినడం చాలా మంచిది.
RELATED ARTICLES
LATEST ARTICLES