HomeHealthpink pineapple : పింక్ పైనాపిల్ తో బోలెడు ప్రయోజనాలు

pink pineapple : పింక్ పైనాపిల్ తో బోలెడు ప్రయోజనాలు

pink pineapple :

అందరం పసుపు రంగులో ఉన్న పైనాపిల్ ని మాత్రమే చూసాం కానీ … పింక్ కలర్ లో ఉన్నా పైనాపిల్ ని ఎక్కువగా మనం చూడలేం ..పైనాపిల్ పింక్ రంగులో ఉంటుంది అని కొంత మందికి మాత్రమే తెలుసు .ఎందుకంటే మనకు మార్కెట్ లో ఎక్కువ పసుపు రంగులో ఉన్న పైనాపిల్ మాత్రమే దర్శనమిస్తుంది. పింక్ రంగులో ఉన్న పైనాపిల్ మార్కెట్ లో తక్కువగా కనిపిస్తుంది. పైనాపిల్ కొన్ని జన్యు పరమైన మార్పిడిలు చేసి ఈ పండు ని తయారు చేశారు. ఈ పండులో బీటా కెరోటిన్ మరియు లైకోపిన్ ని మార్చడం ద్వారా పండు కి పింక్ కలర్ వచ్చింది.

ఈ పింక్ రంగులో పైనాపిల్ చూడటానికి ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా కనబడుతోంది. ఈ పండును 2000 వ సంవత్సరంలో మొదటగా అభివృధి చేశారు. దీన్ని డెల్ మెంటే ఫ్రెష్ ప్రోడ్యూస్ రూపొందించారు. ఇది మంచి రుచి మరియు వాసనను కలిగి ఉంటుంది. ఈ పింక్ పైనాపిల్ యొక్క ఆకులు కూడా పింక్ కలర్ లో ఉంటాయి.ఈ పింక్ పైనాపిల్ యొక్క శాస్త్రీయ నామం అననాస్ కోమోసస్. ఇది బ్రోమేలియాసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ పింక్ పైనాపిల్ ఎక్కువగా కొస్టారికాలో దక్షిణ మధ్య ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి.

Neutrients values in pink pineapple : పింక్ పైనాపిల్ లో పోషక విలువలు

పింక్ పైనాపిల్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పింక్ పైనాపిల్ లో విటమిన్ సి మరియు మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ బి6 , థయామిన్, బ్రోమలైన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఫోలెట్ సమృద్ధిగా ఉంటాయి.

Pink pineapple benefits : పింక్ పైనాపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు

1.పింక్ పైనాపిల్ లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య ని పెంచి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.

2.పింక్ పైనాపిల్ లో ఫ్లేవనాయిడ్స్ మరియు అంతోసైనిన్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

3.పింక్ పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పింక్ పైనాపిల్ లో బ్రోమెలైన్ ఉంటుంది.అర్థరైటిస్ మరియు డయాబెటిస్ వంటి వ్యాధుల వల్ల బాధపడుతున్నవారికి శరీరంలో వచ్చే మంటను తగ్గిస్తుంది.

4.పింక్ పైనాపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ రేటు ని పెంచుతుంది.అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

5.పింక్ పైనాపిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది రక్త పోటుని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా ఒబేసిటీ బారిన పడకుండా కాపాడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES