HomeHealthType 1 diabetes in telugu : టైప్ 1 మధుమేహం లక్షణాలు

Type 1 diabetes in telugu : టైప్ 1 మధుమేహం లక్షణాలు

Type 1 మధుమేహ వ్యాధి : Type 1 diabetes in telugu

మధుమేహ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి టైప్ 1 మరియు టైప్ 2 మరియు గర్బిని లలో వచ్చే మధుమేహం. వీటి అన్నిటిలో కంటే టైప్ 1 మధుమేహం వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఈ మధుమేహ వ్యాధి మనకు తెలియకుండానే మన శరీరంలోని ఒక్కొక్క అవయవ పనితీరును దెబ్బతీస్తుంది. అందుకే ఈ మధుమేహ వ్యాధి తో బాధపడుతున్నవారు షుగర్ లిమిట్స్ లో ఉంచుకుని జీవనాన్ని కొనసాగించడం మంచిది. లేదంటే మధుమేహం వ్యాధి వల్ల వచ్చే తర్వాత పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ఈ మధుమేహం వ్యాధి ఉన్నవారు డాక్టర్స్ చెప్పినట్టుగా డైట్ ని ఫాలో అయ్యి రక్తంలో చక్కెర స్థాయి ని తగ్గించుకోవాలి. ఇప్పటివరకు ఈ వ్యాది ని పూర్తిగా నయం చేసే మందు మాత్రం లేదు. ప్రస్తుతం మనం టైప్ 1 మధుమేహం వ్యాధి గురించి తెలుసుకుందాం.

టైప్ 1 మధుమేహం ఎందుకు వస్తుంది ?

టైప్ 1 మధుమేహ వ్యాధి ( Type 1 diabetes in telugu ) జన్యు పరమైన లోపాలు ఉన్న వారికి మరియు వారి క్లోమా గ్రంథి పూర్తిగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయనపుడు మరియు చాలా తక్కువగా ఉత్పత్తి చేస్తున్నపుడు అలాగే కొందరిలో వారి ఇమ్యూనిటి సిస్టమ్ వారి పైన దాడి చేసినపుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు.

type 1 diabetes in telugu

టైప్ 1 మధుమేహం ఎవరిలో కనిపిస్తుంది ?

టైప్ 1 మధుమేహ వ్యాధి ఎక్కువగా చిన్న పిల్లలలో మరియు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారిలో కనిపిస్తుంది. కొన్ని సార్లు 20 యేళ్లు దాటాక కూడా ఈ టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టైప్ 1 మధుమేహ వ్యాధి లక్షణాలు :

1.ఈ టైప్ 1 మధుమేహ వ్యాధి ( Type 1 diabetes in telugu ) వచ్చినపుడు మొదటగా కనిపించే లక్షణం పదే పదె మూత్ర విసర్జన చేయడం.
2.ఎప్పటిలా కాకుండా ఎక్కువ దాహం వేయడం. నీరు ఎంత తాగిన దాహంగా ఉండడం.
3.బరువు తగ్గిపోవటం.
4.నీరసం ఎక్కువగా ఉంటుంది.
5.కొందరిలో వాంతులు మరియు విరోచనాలు కూడా వస్తాయి.
6.చిన్న పిల్లలు ఎప్పుడు లేనిది అనుకోకుండా పక్క తడపడం.
7.ఎక్కువగా ఆకలి వేయడం.

కొన్ని సార్లు ఏలాంటి లక్షణాలు లేకుండా కూడా కొందరిలో టైప్ 1 మధుమేహ వ్యాధి బయటపడుతుంది.

టైప్ 1 మధుమేహ వ్యాధిని ఎలా నివారించాలి ?

టైప్ 1 మధుమేహ వ్యాధికి ( Type 1 diabetes in telugu ) ఇప్పటివరకు ఎలాంటి పూర్తిగా నివారించే మందులు కానీ సర్జరీ కానీ రాలేదని దానిపై పరిశోధనలు కొనసాగుతున్నట్లు శాస్రతవేత్తలు చెబుతున్నారు. కాబట్టి టైప్ 1 మధుమేహానికి అదుపులో ఉంచుకోవడం ఒకటే పరిష్కారం.
టైప్ 1 షుగర్ వచ్చిన వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు కాబట్టి బయట నుండి వీరికి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలోని గ్లూకోజ్ ని శక్తిల మార్చడానికి ఉపయోగపడుతుంది.

ఈ టైప్ 1 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ముందుగా పాటించాల్సిన నియమాలు :

1.ఇన్సులిన్ ప్రతి రోజు ఒకే సమయానికి క్రమం తప్పకుండా తీసుకోవాలి.
2.కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
3.హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే అవి తొందరగా షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి.
4.రోజు ఉదయం లేవగానే వ్యాయామం చేయడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
5.రోజు ఉదయం కనీసం ఒక గంటన్నర సేపు నడవడం మంచిది.
6.తీపి పదార్థాలు మొత్తమే తీసుకోకపోవడం మంచిది.

టైప్ 1 మధుమేహ వ్యాధి వలన వచ్చే దుష్పప్రభావాలు :

టైప్ 1 షుగర్ అదుపులో లేని వారికి శరీరంలోని ప్రతి అవయవం మీద ప్రభావం చూపుతుంది. టైప్ 1 షుగర్ వచ్చిన పది సంవత్సరాల అదుపులో లేకుండా ఉంటే కిడ్నీ లివర్ మెల్ల మెల్లగా డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా నరాలు దెబ్బతింటాయి మరియు నరాలు దెబ్బతిని రక్త సరఫరా అవ్వకపోవడం వలన కాళ్లలో అల్సర్స్ రావడం మరియు కంటి గుడ్డు దెబ్బతిని కంటి చూపు కోల్పోవటం లాంటివి సంభవిస్తాయి. కాబట్టి టైప్ 1 షుగర్ చిన్న పిల్లలలో చూస్తాం కాబట్టి వారి తల్లదండ్రులు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.
ఈ టైప్ 1 షుగర్ చిన్న పిల్లలకి వస్తుంది కాబట్టి వారి ఇన్సులిన్ ని తిన్న ఆహారానికి సరిపడా యివ్వాలి. లేదంటే షుగర్ లెవెల్స్ తగ్గి పిల్లలు కోమా లోనికి వెళ్లే పరిస్థితి వస్తుంది.

షుగర్ లెవెల్స్ తగ్గాయని ఎలా గుర్తించాలి ?

1.శరీరం మొత్తం తడిసిపోయేల చెమట పడుతుంది.
2.తెలియకుండానే వణుకు రావడం.
3.కళ్ళు తిరగడం.
4.హార్ట్ బీట్ పెరగడం.
ఇవి సాధారంగా కనిపించే లక్షణాలు.

RELATED ARTICLES
LATEST ARTICLES