HomeHealthReasons for heart attack in telugu : గుండెపోటు రావడానికి కారణాలు

Reasons for heart attack in telugu : గుండెపోటు రావడానికి కారణాలు

Reasons for heart attack in telugu :

ఈ రోజుల్లో అందరిలో భయానికి గురిచేసే విషయం ఏంటంటే చిన్న , పెద్ద అని అసలు వయస్సు తేడా లేకుండానే గుండె పోటు ( Reasons for heart attack in telugu ) వచ్చి గుండె ఆగిపోవడం అనేది అందరిలో భయాందోళనలకు గురి చేస్తుంది . కొన్ని సంవత్సరాల ముందు వరకు ముసలి వాళ్ళకి మాత్రమే ఈ గుండెపోటు ఎక్కువగా వచ్చేది. ఈ 2020 సంవత్సరం మొదలు అయినప్పటి నుండి చిన్న వయస్సు వారు గుండెపోటు వలన మరణించడం గమనిస్తున్నాం. దీనికి కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు మన రోజు వారి అలవాట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలో చదువు వొత్తిడి పెరగడం మరియు చిన్న , పెద్ద వయస్సు వారు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం గుండెపోటు రావడానికి ప్రధాన కారణం. అందుకే గుండె ని పదిలంగా ఉంచుకోవాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

reasons for heart attack in telugu

గుండెపోటు రావడానికి కారణాలు : Reasons for heart attack in telugu

1.LDL కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా రక్త నాళాలలో పేరుకుపోవడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరగకపోవడం వలన గుండె పని చేయడం ఆగిపోతుంది.
2.HDL కొలెస్టరాల్ అంటే మంచి కొలెస్టరాల్ స్థాయి శరీరంలో తగ్గిపోవడం కూడా ఒక కారణంగా డాక్టర్స్ చెప్తున్నారు.
3.అధిక బరువు ఉన్నవారిలో కూడా గుండె పోటు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
4.మద్యపానం మరియు ధూమపానం అలవాటు పడిన వారిలో గుండెపోటు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
5.డ్రగ్స్ వాడే వారిలో గుండె పని చేయడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
6.దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి గుండె పోటు తొందరగా రావడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్స్ సూచిస్తున్నారు.
7.ఒకే దగ్గర కూర్చొని పని చేసే వారికి కూడా గుండె పని తీరు తగ్గడం గుండె ఆగిపోవడం గమనించవచ్చు.
8.అధిక ఒత్తిడికి గురి అయిన వారిలో గుండె పోటు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.
9.ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలు మరియు తీపి పదార్థాలను తీసుకొనే వారిలో త్వరగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

గుండెపోటు రాకుండా తీసకోవాల్సిన జాగ్రత్తలు : how to prevent heart attack in telugu

1.రోజు ఉదయం లేవగానే వ్యాయామం చేయాలి.
2.రోజు ఉదయం కచ్చితంగా నలబై అయిదు నిమిషాలు నడవడం గుండెకు ఎంతో మంచి చేస్తుంది.
3.ప్రతి రోజు ఉదయం తినే అల్పరంలో మంచి ఫ్యాట్ ప్రొటీన్లు మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి.
4.ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
5.సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం పూర్తిగా మానేయడం గుండెకు ఎంతో మంచి చేస్తుంది.
6.అధిక బరువును తగ్గించుకొని హెల్తీ వెయిట్ ని మెయింటైన్ చేయడం గుండెకు ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్స్ సూచిస్తున్నారు.
7.దుమపానం మరియు మద్యపానం వల్ల గుండెకు హని జరుగుతుంది కాబట్టి అలవాటు ఉన్నవారు పూర్తిగా ధూమపానానికి మధ్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
8.ప్రతి రోజూ కచ్చితంగా తగినంత నిద్ర పోవాలి.

RELATED ARTICLES
LATEST ARTICLES