Proso millet in telugu :
ప్రోసో మిల్లెట్ ని తెలుగులో వరిగలు ( Proso millet in telugu ) అని పిలుస్తారు. వరిగలు ఒక రకమైన చిరు ధాన్యాలు. ఇవి మొత్తం చిరు ధాన్యాలకు ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వరిగలు సాధారణంగా చూడటానికి గడ్డి గింజలు మాదిరిగా కనిపిస్తాయి. ఇవి గడ్డి జాతికి చెందిన మొక్కగా చెబుతుంటారు. ప్రొసో మిల్లెట్ మొదటగా చైనా లో గుర్తించినట్టు శాస్రతవేత్తలు వెల్లడించారు. ఈ ప్రోసో చిరు ధాన్యాలు చైనా, భారత దేశం ,అమెరికా,నేపాల్, రష్యా, ఉక్రెయిన్ వివిధ దేశాలలో సాగు చేస్తున్నారు.
ఈ వరిగలు వేసవిలో సాగు చేస్తారు. ఈ వరిగలకు తక్కువ నీటి సారం ఉన్న ప్రాంతాలలో కూడా సాగు చేయొచ్చు. వరిగల యొక్క బోటనికల్ పేరు పానికం మిలియాసియం. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
ఈ వరిగలను ( Proso millet in telugu ) చాలా రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇంగ్లీషులో వరిగలను ప్రోసో అని పిలుస్తారు. హిందీ భాషలో బెర్రీ (chena) ( proso millet in Hindi ) అని పిలుస్తారు. తమిళ్ భాషలో ప్రోసొ మిల్లెట్ని పనివరగు అని ( proso millet in Tamil ) పిలుస్తారు. మలయాళంలో వరిగలను పనివరక్ ( proso millet in Malayalam )అని పిలుస్తారు. కన్నడ లో బరగు అని ( proso millet in kannada ) పిలుస్తారు. ఇలా అయా ప్రాంతాల్లో ఆయా రకాలుగా పిలుస్తారు.
వరిగలను చాలా మంది ఎంతో ఇష్టంగా మరియు చాలా రకాలుగా తింటారు. కొందరు ఉప్మాల గా మరియు మరి కొందరు బ్రెడ్ చేయడంలో ఉపయోగిస్తారు. మరి కొంత మంది పుల్క లా చేసుకొని తింటారు. వరిగలలో చాలా మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రోసో మిల్లెట్ లో పోషక విలువలు : Neutrients values in proso millet in telugu
చాలా మంది ఈ మధ్య కాలంలో చిరు ధాన్యాలను తినడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే కేవలం అందులో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వలనే అంతే కాకుండా చిరు ధాన్యాలలో ముఖ్యంగా అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ కలిగి ఉంటాయి.
సాధారణంగా వంద గ్రాముల వరిగలలో ప్రోటీన్ 12mg, ఫ్యాట్ 1.2, మినరల్స్ 2.0 gm, fiber 2.5 mg, కార్బోహైడ్రేట్స్ 70 mg, ఎనర్జీ 341 kcal, క్యాల్షియం 14 mg, పస్పర్స్ 206mg, iron 0.8mg అంతే కాదు వరిగలు తక్కువ గ్లైసిమిక్ ఉన్న ఆహారంగా తీసుకుంటారు.
ప్రోసో మిల్లెట్ ( వరిగల ) వలన ఉపయోగాలు ( uses of proso millet in telugu ) :
వరిగలు మానవ శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతాయి.
1.వరిగలు అధిక బరువు ఉన్నవారు ఆహారంగా తీసుకుంటారు. వరిగలలో బరువు తగ్గించడానికి ఉపయోగపడే మంచి ఫ్యాట్ మరియు ఫైబర్ ఉంటుంది.
2.వరిగలను చాలా మంది శరీరంలోని నరాల వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.
3.మానసిక ఒత్తిడి మరియు ఆందోళన లాంటి మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి వరిగలను ఆహారంగా తీసుకోవడం మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు.
4.వరిగలలో అధిక కాల్షియం ఉండడం వలన ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
5.వరిగలు తక్కువ గ్లైసేమిక్ ఉన్న ఆహారం కాబట్టి ఇది రక్తంలోని చక్కెరను వెంటనే పెంచవు. కావున షుగర్ ఉన్న వారు వరిగలను రోజు తీసుకోవడం మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు.
6.మలబద్దకం మరియు కడుపు ఉబ్బరంతో బాధ పడేవారు వరిగలను ఆహారంగా తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. వరిగలలో అధికంగా ఫైబర్ ఉంటుంది.