Mulberry fruit :
మల్బరీ అనేది ఒక రకమైన పండ్ల చెట్టు ఈ చెట్టు ఆకులను సాధారణంగా పట్టు పురుగుల ఆహారంగాను ఈ చెట్టు పండ్లను ఫ్రూట్ ( mulberry fruit ) సలాడ్ గాను మరియు ఫ్రూట్ జ్యూస్ గాను లేదంటే మామూలు ఫ్రూట్ ని స్నాక్ గాను టీ , వైన్ రూపంలో కూడా తీసుకుంటారు. మల్బరీ పండ్లు అంటే తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మల్బరీ మొక్క మొదట చైనా మరియు జపాన్ దేశాలలో కనుగొనబడిందని నమ్ముతారు. ఈ మల్బరీ చెట్టు ప్రపంచంలో ఆసియా ఆఫ్రికా ,ఉత్తర అమెరికా మరియు చైనా దేశాల నుండి మొదలు భారత దేశం , బుటాన్ నెమ్మదిగా అన్ని దేశాలలో సాగు చేస్తున్నారు.
ముందుగా ఈ మల్బరీ చెట్టు ఆకులను పట్టు పురుగుల ఆహరం కోసమే ఉపయోగించేవారు.పట్టు పురుగులకి మల్బరీ ఆకులను మేతగా వేసి పట్టు పురుగుల నుండి పట్టుని తయారు చేస్తారు.ఈ మల్బరీ చెట్టు మోరస్ జాతికి చెందినది. మల్బరీ పండ్లు మోరాని పండ్ల కుటుంబానికి చేసిందివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మొరాని కుటుంబానికి చెందిన పండ్లు రుచికి తియ్యగా ఉంటాయి.
మల్బరీ పండ్లు ( mulberry fruit in telugu ) చూడటానికి నలుపు రంగులో ఉంటాయి. రుచికి తియ్యగా ఉంటాయి. ఈ మల్బరీ పండ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో పండిస్తారు. ఇవి తెలుపు, గులాబీ, ఎరుపు, నలుపు రంగుల్లో కూడా ఉంటాయి. మల్బరీ చెట్టు బొటానికల్ పేరు ” మోరాస్ spp “. మల్బరీ పండ్లు బ్లాక్ బెర్రీలను పోలి ఉంటాయి. మల్బరీ పండ్లలలో చాలా పోషల్ విలువలు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
మల్బరీ చెట్టుని వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు రకాలుగా పిలుస్తారు. మల్బరీ ని హిందీలో శాటూట్ ( mulberry in Hindi ) అని, తమిళంలో మల్బరీ ని మల్పేరి ( mulberry in Tamil ) అని, మరాఠీ లో టుటి ( mulberry in Maraati ) అని, మలయాళంలో మల్బారి అని ( mulberry in Malayalam ), కన్నడ భాషలో హిప్పునెరజి ( mulberry in kannada ) అని పిలుస్తారు.
మల్బరీ పండ్లలలో పోషక విలువలు : Neutrients values in mulberry fruit
మల్బరీ పండ్ల లలో 80 శాతం నీరు 1.8 ఫైబర్gm , ప్రోటీన్స్ 1.6 g, షుగర్స్ 8.0 gm, ఫ్యాట్ 0.3g, కార్బ్స్ 9.6 gm, కాలరీస్ 44 లభిస్తాయి.
మల్బరీ పండ్ల ఉపయోగాలు : benifits of mulberry fruit
మల్బరీ చెట్టు కేవలం పండ్ల కోసమే కాదు మల్బరీ ఆకులు మరియు మల్బరీ కలప ఇలా చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది.మల్బరీ పండ్లలో పోషకాలు పుష్కళంగా లభిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు.
1.ఈ మల్బరీ పండ్లను తినడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. అలాగే గుండెకు సంబంధించిన రక్తనాళాలలో ఉండే కొవ్వు ని కూడా కరిగించుకోవచ్చు అని డాక్టర్స్ సూచిస్తున్నారు.
2.మల్బరీ పండ్లలలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది కాబట్టి డీహైడ్రషన్ తో బాధపడే వారు ఈ పండ్లను తినడం వలన ఉపశమనం కలుగుతుంది.
3.మల్బరీ పండ్లల లో ఫైబర్ కూడా అధికంగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థని సక్రమంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.
4.మల్బరీ పండ్ల కి అన్ని బెర్రీస్ పండ్ల కంటే అధికంగా యాంటియాక్సిడెంట్స్ ఉన్నట్టుగా ఇవి క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి క్యాన్సర్ నుండి కోలుకోవడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే వీటిని తినటం వలన భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు.
5.మల్బరీ పండ్ల ను మధుమేహం ఉన్నవారు సంతోషంగా తీసుకోవచ్చు. ఇది తియ్యగా ఉన్న కూడా ఈ పండుకి రక్తంలోని చక్కెర ని అదుపులో ఉంచే గుణం ఉన్నట్టు అధ్యయనాలలో వెల్లడించారు.
6.ఈ మల్బరీ పండ్లు కేవలం ఈ అవయవానికి అని కాకుండా మానవ శరీరం లోని అన్ని అవయవాలకు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. వీటి తీసుకుంటే చర్మం గ్లో వస్తుంది. వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది.
గమనిక : ఇలా మల్బరీ పండ్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా అని మల్బరీ పండ్లను అధికంగా తీసుకోకూడదు. రోజులో 80 grams పండ్లను తినడం మంచిది.