Noni fruit :
ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ అందుతాయి. అందులో ఒక ఫ్రూట్ నోని ఫ్రూట్ ( Noni fruit ) . బహుశా చాలా మందికి ఈ నొని ఫ్రూట్ గురించి తెలియదు. ఈ నొని ఫ్రూట్ కూడా మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది అందుకే చాలా మందికి ఈ పండు గురించి తెలియదు. కానీ ఈ పండులో చాలా విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. దీనివల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ సమానంగా అందుతాయి.
నోని ఫ్రూట్ నీ ( Noni fruit in telugu ) తెలుగు లో తొగరు పండు అని కూడా పిలుస్తారు. దిన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తారు కానీ ఈ మార్కెట్ లో అంత ఎక్కువగా మనకి కనిపించదు. నోని ఫ్రూట్ చూడటానికి మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అచ్చం చూడటానికి బంగాళదుంప ఆకారం లో ఉంటుంది. అంతేకాకుండా దీని లోపలి భాగం చూడటానికి కొంచం సీతాఫలం లా ( custard apple ) ఉంటుంది. ఈ పండు లోపలి భాగంలో గింజలు కూడా ఉంటాయి.

Noni fruit benefits : నోని ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
నొని ఫ్రూట్ నీ వామిట్ ఫ్రూట్ ( vamit fruit ) అని కూడా పిలుస్తారు. ఈ పండుని ఔషధాల గని అని కూడా పిలుస్తారు. దీనిలో పుష్కలంగా ఉన్న పోషకాల కారణంగా డాక్టర్లు సైతం ఈ పండు నీ తినమని చెప్తారు. ఈ పండులో విటమిన్ సి ( vitamin c ) మరియు బి3 మరియు విటమిన్ ఎ ( vitamin A ) , ఐరన్ ( iron ) పుష్కలంగా ఉంటాయి. అందుకే నోని ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం లో చక్కెర స్థాయి ను ( blood sugar ) తగ్గిస్తాయి. ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులను ( legs pain ) కూడా తగ్గిస్తాయి.