mixed dry fruits :
డ్రై ఫ్రూట్స్ ( mixed dry fruits ) మన శరీరానికి ఎన్నో పోషక విలువలు అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ చాలా ఖరీదైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయని తెలిసిన చాలా మంది వీటిని తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే వీటి ధర మార్కెట్ లో చాలా ఎక్కువ. అందుకే వీటిని చాలా మంది తినడానికి ఆలోచిస్తుంటారు. కానీ రోజు కొన్ని డ్రై ప్రూట్స్ తీసుకుంటే మన శరీరానికి కావల్సిన పోషక విలువలు అన్ని అందుతాయి. డ్రై ఫ్రూట్స్ లో అధిక పోషకాలు , విటమిన్లు, ప్రోటీన్స్ మరియు ఖనిజాలు మరియు డైయేటరీ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఫ్రూట్స్ ని ఎండలో ఎండబెట్టి లేదా వేరే ఇతర పద్ధతుల ద్వారా ఎండబెట్టిన వాటిని డ్రై ఫ్రూట్స్ అంటారు. ఇలా ఎండబెట్టిన వాటిని మనం నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ని ( mixed dry fruits ) అరబ్ దేశం వాళ్ళు ఎక్కువగా తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ మనకి బయట షాప్స్ లో లేదా సూపర్ మార్కెట్ లో ( dry fruits shop near me )ఎక్కువగా లభిస్తాయి. వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ లో మనకు చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం డ్రై ఫ్రూట్స్ కి ఒక్కో రేట్ ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ లో ( mixed dry fruits ) బాదం ని కింగ్ గా పిలుస్తారు. బాదం పప్పు లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అందుకే బాదం ని డ్రై ఫ్రూట్ కింగ్ గా పిలుస్తారు. దాదాపు బాదం లో 160 కి పైగా కేలరీలు , 5 గ్రాములకి పైగా ప్రొటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు , ఫైబర్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో బాదం , పిస్తా , వాల్నట్స్ , కర్జుర , అంజీర, జీడిపప్పు, అప్రికాట్, ఎండు ద్రాక్ష, అజెల్ నట్స్ మరియు ప్రూనే అధిక పోషకాలను కలిగి ఉంటాయి మరియు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
డ్రై ఫ్రూట్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు : health benefits of mixed dry fruits
1.డ్రై ఫ్రూట్స్ మన శరీరం లో రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి. కరోనా సమయం లో రోగ నిరోధక శక్తి పెరగడానికి అందరూ డ్రై ఫ్రూట్స్ ని తిన్నారు. ఎందుకంటే ఇవి శరీరం లో హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అంతేకాకుండా వీటిలో పొట్టాషియం , ఐరన్ , పోలెట్ , కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
2.బాదం పప్పు రోజు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. అంతేకాకుండా స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదల ని అడ్డుకుంటుంది.
3.ఉభకాయం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ మరియు స్నాక్స్ తినడం వల్ల త్వరగా శరీరం లో కొవ్వు పెరిగి బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారు రోజు డ్రై ఫ్రూట్స్ ని తింటే బరువు ని తగ్గుతారు. డ్రై ఫ్రూట్స్ లో తక్కువ శాతం లో కొవ్వు మరియు చక్కెర ఉంటుంది.
4.మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి డ్రై ఫ్రూట్స్ ఒక చక్కటి పరిష్కారం. ఆంజీర fig dry fruit పండ్లలలో ఫైబర్స్ అధికంగా ఉంటాయి. వీటిని తింటే మలబద్దకం సమస్య త్వరగా తగ్గుతుంది.
5.డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మన శరీరంలో ఉండే ఎముకలను మరియు కండరాలను శక్తివంతం చేస్తాయి.
6.మానసిక సమస్యతో బాధపడుతున్నవారు డ్రై ఫ్రూట్స్ ని తినడం వల్ల మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.