HomeHealthBasil leaves in telugu : తులసి అరోగ్య ప్రయోజనాలు

Basil leaves in telugu : తులసి అరోగ్య ప్రయోజనాలు

Basil leaves in telugu :

తులసి ని ఇంగ్లీష్ లో tulasi, holy basil అని పిలుస్తారు. తులసి శాస్త్రీయ నామం ఓసియం టెన్యుఫ్లోరం ( Ocimum tenuifloram). తులసిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ తులసి మరియు రెండవది రామ తులసి. మనం ఎక్కువగా కృష్ణ తులసి ని పూజకి వాడుతాం. ఈ కృష్ణ తులసి ని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. పండగ రోజు స్త్రీలు తులసి మొక్క కి ప్రత్యేక పూజలు చేస్తారు ( basil leaves in telugu ). తులసి తీర్థాన్ని హిందూ సంప్రదాయం లో చాలా పవిత్రంగా భావిస్తారు. మనిషి చనిపోయే ముందు కూడా నోట్లో తులసి తీర్థం పోస్తారు. ఎందుకంటే తులసి 24 గంటలు ప్రాణ వాయువుని విడుదల చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్కని పెంచుకుంటారు ( basil leaves in telugu).

తులసి చెట్టును భారతదేశం లో దైవంతో సమానంగా కొలుస్తారు. ఎందుకంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు తులసి చెట్టుకు ఉన్న పవిత్రత అలాంటిది. ప్రతి తెలుగు ఇంట ఒక తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తులసి మొక్క కి ఆడవాళ్ళు ప్రొద్దున్నే స్నానం చేసి తులసి మొక్కకు ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేయడమే కాకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని కూడా వెలిగిస్తారు. పురాతన కాలం నుంచి తులసి మొక్కని ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారీ లో వాడుతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థం అయ్యే ఉంటుంది తులసి మొక్క ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్య మరియు అరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అందుకే తులసి మొక్క కి ఆయుర్వేదం లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

కొందరు తులసి ఆకులని నమిలి తినవద్దు అంటారు.ఎందుకంటే తులసి ఆకుల్ని మనం నోట్లో వేసుకుని నమిలి తింటే తులసి లో ఉండే పాదరసం మరియు ఐరన్ పళ్ళ ఎనామిల్ ని దెబ్బతీస్తుంది అని అంటారు. తులసి ని డైరెక్ట్ గా తినకుండా తులసి ఆకుల్ని గ్రైండ్ చేసి వాటర్ తో కలిపి అయిన తీసుకోవాలి . ఒకరోజు ముందు వాటర్ లో తులసి ఆకుల్ని నానబెట్టి తర్వాత రోజు వాటర్ తోం పాటు మింగేయాలి. కానీ తులసిని నమిలి తింటే పళ్లకి హాని జరుగుతుందని ఎక్కడ మనకి సైంటిఫికల్ గా ఆధారం లేదు.

basil leaves in telugu

తులసి ఆకుల ఉపయోగాలు : Health benefits of Basil leaves

1.తులసి ఆకులు తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

2.తీవ్ర జ్వరం తో బాధపడేవారు తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే డెంగ్యూ మరియు మలేరియా జ్వరం నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.

3.మనం ఎన్ని రకాల మందులను వాడిన దగ్గు మరియు జలుబు త్వరగా తగ్గదు. కానీ తులసి ఆకులో కొంచం ఒమ తీసుకుని నమిలి తినాలి.ఇలా చేస్తే దగ్గు మరియు జలుబు త్వరగా తగ్గుతుంది.

4.గొంతు గరగర తో బాధపడుతున్నవారు నీటిలో తులసి ఆకులని వేసి మరిగించాలి. ఈ నీటిని నోట్లో పుక్కిలించినా గొంతు గరగర నుంచి మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

5.కొంచం తులసి రసాన్ని తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనె ని కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.

6.మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని తగ్గించడానికి తులసి ఆకుల్ని మెత్తగా రుబ్బి దానికి పాలు చక్కెర ని కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని తగ్గిస్తుంది.

7.ముఖ్యంగా తులసి ఆకుల్ని ముఖ సౌందర్యానికి మహిళలు ఎక్కువగా వాడుతారు. తులసి ఆకుల్ని మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకుని మొహానికి అప్లై చేయాలి. కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో కడిగేయాలి.ఇలా చేస్తే మొహం పై వున్న మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

8.ప్రతి రోజు తులసి ఆకుల్ని తినడం వల్ల వొత్తిడి తగ్గింది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

9.తులసి ఆకుల్ని తింటే రక్తం కూడా శుద్ధి అవుతుంది.

10.డయాబెటీస్ తో బాధ పడేవారు రోజు తులసి ఆకుల్ని తింటే రక్తం లో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

11.రోజు తులసి ఆకుల్ని మెత్తగా రుబ్బి దానికి తేనె ని కలిపి పడిగడుపున తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

12.తులసి లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడేవారు తులసి ఆకుల్ని తీసుకుంటే స్కిన్ అలెర్జీ తగ్గుతుంది.

13.రోజు నీళ్ళు సరిగా త్రాగపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యతో బాపడుతున్నవారు తులసి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి.

14.తులసి ఆకుల్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్టరాల్ ని కరిగిస్తుంది.

15.హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు తులసి ఆకుల్ని తీసుకుంటే గుండె కి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెపోటును రాకుండా చూస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES