ashwagandha benefits:
అశ్వగంధ యొక్క శాస్త్రీయ నామం విథానియా సామ్నిఫెర దీనిని ఆయుర్వేదంలో అశ్వగంధ ( Ashwagandha ) అని పిలుస్తారు. తెలుగులో దీనిని పెన్నెరు గడ్డ అని పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అశ్వగంధ అంటే తెలియని వారు చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాదాపు చాలా మంది ఈ అశ్వగంధ ని ( ashwagandha ) వాడుతున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాది వచ్చి తగ్గినాక ఈ అశ్వగంధ వాడకం ఇంకా పెరిగింది. అసలు ఈ అశ్వగంధ అంటే ఏమిటి ఎలా దీనిని వాడుకోవచ్చు ? ఏ రకమైన ఆరోగ్య సమస్యలకు వాడుకోవాలి ? అనేది తెలుసుకుందాం.
అశ్వగంధ ఉపయోగాలు : Health Benefits of Ashwagandha
అశ్వగంధకి ఎలాంటి వ్యాదిని అయిన తగ్గించే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వేళ మీ ఆరోగ్య నమస్య మీకు తెలియకపోయిన మీరు ఈ అశ్వగంధ చూర్ణాన్ని ( ashwagandha powder ) అర చెంచాడు చొప్పున రోజుకు రెండు సార్లు రెండు నెలలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ అశ్వగంధని ఇలా కాకుండా కొన్ని అనారోగ్యాలకు ముఖ్యంగా వాడుతుంటారు.
1.జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.
2.ఆందోళన మరియు ఒత్తిడిని దూరం చేస్తుంది.
3.మగ వారిలో శుక్ర కణాల సంఖ్య ను పెంచుతుంది.
4.నిద్రలేమి సమస్యని దూరం చేస్తుంది.
5.మధుమేహాన్ని అదుపులో పెడుతుంది.
6.రక్తపోటుని అరికడుతుంది.
7.మన శరీర రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
8.మెంటల్ హెల్త్ ని కంట్రోల్ చేస్తుంది.
9.ఆడవారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ని మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుంది.
10.అశ్వగంధ గుండెకు సంబంధించిన కండరాలను శక్తివంతం చేస్తుంది.
11.అశ్వగంధ శరీరంలో చెడు బ్యాక్టిరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.
12.అశ్వగంధ థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపరుస్తుంది.
13.కీమోథెరపి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా కాపాడుతుంది.
14.అశ్వగంధలో అధిక మొత్తంలో యాంటియాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.
15.అశ్వగంధ హార్మోనల్ బ్యాలెన్స్ లో ఎంతో ఉపయోగపడుతుంది.
1.అశ్వగంధ ఎవరైతే ఎక్కువ మతిమరుపుతో బాధపడుతున్నారో అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అశ్వగంధ మన మెదడలోని నరాల మీద పని చేసే గొప్ప గుణాన్ని కలిగి ఉంది. అది మన మెదడును ఆరోగ్యంగా ఉండడానికి మరియు జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మతిమరుపుతో బాధపడేవారు రోజూ అర టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వలన మతిమరుపుని దూరం చేసుకోవచ్చు.
2.ఈ మధ్య కాలంలో ప్రతి మనిషికి రోజు ఉండే పనుల వలన ఒత్తిడి మరియు ఆందోళన అధికంగా ఉంటున్నాయి. వీటిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం లేదంటే వీటి వలన వేరే ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అధిక ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించే గుణం కేవలం అశ్వగంధ లోనే ఉన్నట్టు ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంధ లో కార్సిటోల్ అనే ఒత్తిడిని తగ్గించే హార్మోన్ ఉండడం వలన అది మన మెదడులోని ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది. కావున అశ్వగంధ చూర్ణాన్ని రోజు ఒక అర టీ స్పూన్ తీసుకోవడం మన శరరానికి మెదడుకి చాలా మంచిది.
3.అశ్వగంధ మగ వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచుతుంది. అలాగే వారి శుక్ర కణాల సంఖ్య ను పెంచుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి మగ వారు టెస్టోస్టిరాన్ హార్మోన్ ని మరియు శుక్ర కాణాల సంఖ్యను పెంచుకోవడానికి అశ్వగంధని తీసుకుంటే చాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
4.ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా నిద్రలేమితో బాధపడే వారికి అశ్వగంధ ఒక మంచి ఔషధంగా చెప్పొచ్చు. ఎందుకంటే అశ్వగంధలో నిద్రలేమిని తగ్గించి మంచి నిద్రను పెంపొందించే గుణాలు ఎక్కువగా ఉన్నట్టు ఆయుర్వేద పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి మంచి నిద్ర కోసం పడుకొనే ముందు అశ్వగంధ చూర్ణాన్ని ఒక సగం టీ స్పూన్ పాలతో కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
5.ప్రపంచంలో అతిపెద్ద వ్యాధులలో 10 వ స్థానం మధుమేహ వ్యాధిధి. ఈ మధుమేహ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారికి అశ్వగంధ చాలా ఉయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మధుమేహాన్ని నియంత్రణలో ఉండేలా చేసే గుణం ఉంది కాబట్టి మధుమేహ వ్యాదితో బాధపడుతున్న వారు అశ్వగంధ చూర్ణాన్ని రోజు తీసుకోవడం వలన మీ రక్తంలోని చక్కర స్థాయిని తగ్గించుకోవచ్చు.
6.అశ్వగంధ గుండెపోటు రాకుండా అడ్డుకొని గుండెకు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి గుండె జబ్బులతో బాధ పడేవారు రోజు ఉదయం లేవగానే ఆఫ్ టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మి గుండెకు మంచి చేస్తుంది.
7.అశ్వగంధ లో శరీరరోగ నిరోధకశక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నట్టు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి శరీరరోగ నిరోకశక్తిని పెంపొందించువడానికి అశ్వగంధ చూర్ణాన్ని రోజు ఉదయం తీసుకోవడం వలన ఎలాంటి వ్యాదులు రాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
8.ప్రస్తుత కాలంలో చాలా మంది పని వలన మరియు వారి పర్సనల్ విషయాల వలన మానసికంగా బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. అలాంటి వారు యాంటీడిప్రెషన్ మెడిసిన్ వాడిన ఎలాంటి ఉపయోగం ఉండదు.అలాంటి వారికి అశ్వగంధ ఒక మంచి మెడిసిన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మానసికంగా బాధపడే వారు డిప్రెషన్ లో ఉన్న వారు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వలన మీరు తొందరగా డిప్రెషన్ నుండి బయటపడవచ్చు.
9.ప్రపంచ వ్యాప్తంగా ఆడవారిలో ఈ మధ్య కాలంలో చూసే సమస్య ఇన్ఫర్టిలీటి. ఇలాంటి సమస్యతో బాధపడేవారికి ఈ అశ్వగంధ చాలా ఉపయోగపుతుంది. అశ్వగంధ ఆడవారిలో గుడ్డు యొక్క నాణ్యతని పెంచుతుంది. కాబట్టి ఆడవారు రోజు అశ్వగంధని తీసుకోవడం వలన ఇన్ఫర్టిలిటీని సమస్యను అధిగమించవచ్చు.
10.అశ్వగంధ గుండెకు సంబంధించిన కండరాలను శక్తివంతం చేసి గుండెకు అలాంటి అనారోగ్యం రాకుండా చేస్తుంది. అలాగే చెడు కొవ్వుని కరిగించి గుండెకు వెళ్ళే రక్త ప్రసరణని సరిగా జరిగేలా చేస్తుంది.
11.అశ్వగంధ కి మానవ శరీరంలోని చెడు బాక్టీరియా ని నిర్మూలించి గుణం ఉంది. కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు రోజు ఉదయం లేవగానే ఒక అర టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
12.ప్రస్తుత కాలంలో ఆడవారిలో థైరాయిడ్ గ్రంథి సమస్యలను ఎక్కువగా చూస్తున్నారు. ఇలా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి అశ్వగంధ థైరాయిడ్ గ్రంధి ని బాగా పనిచేసేలా చేసి థైరాయిడ్ లెవెల్స్ ని నార్మల్ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి హైపో థైరాయిడ్ సమస్య ఉన్నవారు అశ్వగంధ చూర్ణాన్ని రోజు ఉదయం లేవగానే తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యని తగ్గించుకోవచ్చు.
13.అశ్వగంధ కాన్సర్ తో బాధపడుతున్నా వారికి మరియు కీమోథెరపీ రేడియేషన్ ప్రభావం వలన వచ్చే దుష్పరిణామాలు నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి కాన్సర్ తో బాధపడే వారు కీమోథెరపీ చేయించుకునే వారు అశ్వగంధ తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
14.అశ్వగంధ లో అధిక యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన అశ్వగంధ ఆరోగ్యానికి ఎంతో ఉయోగపడుతుందని శాస్రతవేత్తలు చెబుతున్నారు.
15.ప్రస్తుత కాలంలో ఆడవారు ఎక్కువగా బాధపడే సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు అలా హార్మోనల్ ఇంబ్యాలేన్స్ తో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ ని రోజు ఉదయం తీసుకోవడం వలన మీ హార్మోన్స్ సరిగా ఉత్పత్తి అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
అశ్వగంధ యొక్క దుష్పరిణామాలు : side effects of ashwagandha
1.అశ్వగంధ ని మొదట ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది. ఇలా తీసుకోవడం వలన డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2.హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్న వారు అశ్వగంధ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే హైపర్ అంటే మీకు ముందుగానే థైరాయిడ్ హర్మోన్ ఎక్కువగా పని చేస్తుంది.అశ్వగంధ వాడడం వలన ఇంకా ఎక్కువ పని చేస్తుంది కాబట్టి హైపర్ థైరాయిడ్ బాధపడే వారు తీసుకోవద్దు.
3.అశ్వగంధ ని రెండు నెలలు మాత్రమే తీసుకోవాలి లేదంటే ఓవర్ డోస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.దీని వల్ల వేరే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.