HomeHealthDurian fruit : దుర్వాసన వచ్చే పండుతో ఆరోగ్య ప్రయోజనాలు

Durian fruit : దుర్వాసన వచ్చే పండుతో ఆరోగ్య ప్రయోజనాలు

Durian fruit :

ఎవరైనా సరే ఎదైన పండు తినాలి అనుకుంటే మనం రుచి చూసి లేదా దాని వాసన చూసో మొదటగా తింటాం. కొన్ని పండ్లు తియ్యటి రుచిని , కొన్ని పండ్లు పులుపు మరియు వగరు రుచి లేదా చేదు రుచి ని కలిగి ఉంటాయి. పండు ఎక్కువగా రుచి ఉంటే ఆ పండు ని ఎక్కువగా తినడానికి ఇష్టం పడుతాం. ఒక్కోసారి మనం పండు యొక్క ఆకారాన్ని బట్టి కూడా ఆలోచిస్తుంటాం పండు తినాలా లేదా వద్దా అని. సృష్టిలో అన్ని పండ్లు ఒకేలా ఉండవు కొన్ని పండ్లు వాసన చూస్తే మీరు అస్సలు ఆ పండ్లని తినకూడదు అనుకుంటారు. అలాంటి పండ్లలో ఒకటి డురియన్ పండు. ఈ డురియన్ పండు చాలా దుర్వాసనను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచం లో చాలా అన్నిటికంటే దుర్వాసన వచ్చే పండు కూడా ఈ డురియన్ పండే.

ఈ డురియన్ పండు చూడటానికి అచ్చం పనస పండు వలె ఉంటుంది. అంతేకాకుండా ఈ పండు పనస పండులా పెద్ద ఆకారంలో ఉంటుంది. ఈ పండు లోపలి భాగం వాసన చూస్తే కుళ్లిపోయిన మాంసం వాసన వస్తుంది. దీని యొక్క వాసన చూస్తే పడనివారు కచ్చితంగా వాంతులు చేసుకుంటారు. వాసన వస్తుంది కదా అని ఈ డురియన్ పండు ని ఒక పిచ్చి పండు గా కొట్టి పడేయకండి. ఈ డురియన్ పండు లో మన శరీరానికి అవసరం అయిన విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఈ పండు వాసన వస్తున్న మరీ తింటారు. ఈ పండు వాసన వస్తుంది కాబట్టి వాసన పడని వారు ముక్కు మూసుకుని తినడం ఉత్తమం. ఈ పండు దుర్వాసన వస్తుంది కాబట్టి అమ్మేటపుడు దుకాణ దరుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఒక గ్లాస్ జాడీలో పెట్టి మరీ అమ్ముతారు. లేకుంటే దుకాణం మొత్తం కుళ్ళిన వాసన వచ్చే ప్రమాదం ఉంది.

దుర్వాస వచ్చే పండు ని ఎవరు కొంటారు ? అనుకోకండి ( durian fruit online ) .. మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ డురియన్ పండు కి మార్కెట్ లో 5000 రూపాయల నుంచి 8000 రూపాయల వరకు ధర ( durian fruit price ) పలుకుతుంది. ఈ డురియన్ పండు ని పెంచాలి అంటే చాలా కష్టం. ఇది చాలా కర్చుతో కూడుకున్న పని. అందుకే వీటిని ఎక్కువ మంది సాగు చేయరు. ఈ డురియన్ పండు యొక్క చెట్టు ( durian fruit plant ) దాదాపుగా 90 నుంచి 150 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్లు ఎక్కువగా ( durian fruit near me )ఉష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ డురియన్ పండు ఒక్కోటి మూడు నుంచి నాలుగు కేజీల బరువు ఉంటుంది. డురియన్ పండు లో లోపలి భాగం లో 50 శాతం మేరకు మాత్రమే గుజ్జు ఉంటుంది. మిగతాది అంత దాని యొక్క బెరడు మాత్రమే ఉంటుంది. దానికి ముల్లులు కూడా ఉంటాయి. వీటిని చెట్టు నుంచి కోసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Neutrients values in Durian fruit : డురియన్ పండు లో పోషక విలువలు

డురియన్ పండు లో ఇనుము , రాగి , మాంగనీస్ , సోడియం , పొటాషియం , ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సి , విటమిన్ బి కాంప్లెక్స్ , మెగ్నీషియం ముదలగు ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని దుర్వాసన కారణంగా చాలా మంది తినడానికి అయిష్టత చూపిస్తారు. కానీ వీటి ధర మాత్రం చాలా ఎక్కువ. ఈ డురియన్ పండు ఆగ్నేషియా దేశానికి చెందినది. అంతేకాకుండా ఫిలిప్పైన్స్ , థాయిలాండ్ ,ఇండోనేషియా మరియు మలేషియా దేశాల్లో కూడా పెరుగుతుంది.

Durian fruit benefits : డురియన్ పండు తో ఆరోగ్య ప్రయోజనాలు

  • డురియన్ పండు లో విటమిన్ సి ఉంటుంది. మన శరీరం ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  • డురియన్ పండు లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియ సరిగా జరగని వారు ఈ పండు తినడం చాలా మంచిది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ రేటు ని పెంచుతుంది.
  • డురియన్ పండు తినడం వల్ల శరీరంలో కండరాలు మరియు నరాలు ధృడంగా ఉంటాయి. అంతేకాకుండా దంతాలు కూడా ధృడంగా ఉంటాయి.
  • మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ డురియన్ పండు ని తింటే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది.
  • డురియన్ పండు లో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు ని కూడా అదుపులో ఉంచుతుంది.
  • లైంగిక సమస్యలతో బాధపడేవారు ఈ డురియన్ పండు తినడం చాలా మంచిది. అంతేకాకుండా షుగర్ పేషంట్స్ తినడం చాలా మంచిది ఎందుకంటే డురియన్ పండు లో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంది.
RELATED ARTICLES
LATEST ARTICLES