HomeHealthdiet chart for weight loss : త్వరగా బరువు తగ్గడానికి చిట్కాలు

diet chart for weight loss : త్వరగా బరువు తగ్గడానికి చిట్కాలు

diet chart for weight loss :

ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా కూడా మొదటగా బాధ పెట్టే అతి పెద్ద సమస్య ఉభకాయం ( diet chart for weight loss ) లేదా బరువు పెరగటం. అసలు కారణమేమిటో తెలియకుండానే బరువు పెరిగే వాళ్ళు చాలా ఉన్నారు. అంతే కాదు ఎందుకు బరువు పెరుగుతున్నమో తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తే బరువు తగ్గుతారో తెలియని వారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు పెరిగే సమస్య నుండి బయట పడాలి అంటే దానికి కావాల్సిన డైట్ మరియు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. లేదంటే బరువు పెరగడం ఒకటే కాదు దాని వలన వచ్చే సమస్యల తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక మంచి డైట్ ప్లాన్ తో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
బరువు తగ్గాలి అనుకునే వారు ముందుగా చేసే పెద్ద తప్పు సరైన ఆహారాన్ని ఏంచుకోకపోవడం అలాగే కొన్ని రకాల నియమాలు పాటించకపోవడం. ఇప్పుడు మనం బరువు ఆరోగ్యంగా తగ్గడానికి ఒక మంచి డైట్ ప్లాన్ తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి మంచి డైట్ ప్లాన్ ( best diet plan for weight loss ):


1.ఉదయం అల్పాహారం ( morning breakfast ) : best diet chart for weight loss
ఉదయం లేవగానే మనం తినే అల్పాహారం ఎప్పుడు గాని ఓట్స్ (oats) లాంటి అధిక ఫైబర్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి లేదా ప్రోటీన్ కోసం ఉడకపెట్టిన గుడ్డు మరియు విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా దొరికే ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. ఉదయం తినే ఆహారం ఎప్పుడు కానీ తక్కువగా తీసుకోనెలా చూసుకోవాలి. ఉదయం అల్పహారం తీసుకున్నాక మధ్యాహ్నం భోజనానికి మధ్య స్నాక్స్ లా ఆపిల్ కానీ నట్స్ కానీ తినవచ్చు.

2.మధ్యాహ్నన భోజనం ( afternoon lunch ) : diet chart for weight loss
మధ్యాహ్నం తీసుకునే ఆహారం రకరకాల కూరగాయలతో కూడిన సలాడ్ కానీ చికెన్ కానీ తీసుకుంటే తొందరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకవేళ ఆకలిగా అనిపిస్తే సాయంత్రం పూట క్యారెట్ ముక్కలు కానీ బీట్రూట్ ముక్కలు కానీ తీసుకుంటే మంచిది.

3.రాత్రి భోజనం( night dinner ): indian diet for weight loss
రాత్రి భోజనం ఎప్పుడు కానీ తక్కువగా తీసుకోవటం వలన పొట్ట లైటు గా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు రాత్రి పూట కొంత రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. రాత్రి భోజనంలో చికెన్ మరియు కొన్ని రకాల కూరగాయలు సలాడ్ లా కానీ చేసి తీసుకుంటే మంచిది. అంతే కాదు బెర్రీస్ లాంటి ఫ్రూట్స్ తో కూడా రాత్రి భోజనాన్ని ముగించుకోవచ్చు.రోజు మొత్తంలో తీసుకునే ఆహారం తక్కువ క్యాలరీల తో కూడిన ఆహారం కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మంచి డైట్ ప్లాన్ నీ రోజు పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆహారం ఎప్పుడు కానీ బరువు తగ్గే విషయంలో 70 శాతం మాత్రమే పనిచేస్తుంది మిగితది శరీరానికి కొంత శారీరక వ్యాయామం అవసరం మరియు వ్యాయమం చేస్తూ తక్కువ కాలరీస్ కూడిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటేనే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES