HomeHealthCoconut Milk : కొబ్బరి పాలతో ఆరోగ్య ప్రయోజనాలు

Coconut Milk : కొబ్బరి పాలతో ఆరోగ్య ప్రయోజనాలు

Coconut milk :

కొబ్బరి పాలు ( coconut milk ) అందరూ ఇప్పటికీ చాలా సార్లు విని ఉంటారు కానీ దీని వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకొని ఉండరు. కొబ్బరి పాలను పచ్చి కొబ్బరి నుండి తీస్తారు. కొబ్బరి పాల తో అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో ( coconut milk benefits ) ప్రత్యేకంగా బిర్యానీ ,పులావ్ ఇంకా తీపి పదార్థాలు ఎక్కువగా తయారు చేసుకుంటారు. చిన్నల నుంచి పెద్దల వరకు పచ్చి కొబ్బరిని ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీని రుచి కూడా ఒక కారణం. కొబ్బరి లో 60 శాతం మేరకు ఫైబర్ ఉంటుంది. పచ్చి కొబ్బరి లో విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి , థయామిన్ , నియాసిన్, రిబోఫ్లావిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పాలను ( coconut milk ) కొందరు రోజు తాగుతుంటారు అలా తాగే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని న్యూట్రీషన్స్ సూచిస్తున్నారు.

కొబ్బరి పాల వలన ఉపయోగాలు ( cocounut milk benifits ) :

  • కొబ్బరి పాలను ( coconut milk ) రోజు తాగుతు ఉంటే ఈ పాలలో ఉండే విటమిన్ ఇ మరియు విటమిన్ సి లు చర్మ పరిరక్షణకు మరియు సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
  • కొబ్బరి పాలు చర్మం యొక్క సౌందర్యానికి కాకుండా చర్మ రక్షణకి కూడా ఒక మంచి ఔషదంగాను పనిచేస్తాయి. అంతేకాకుండా కొబ్బరి పాలను రోజు తీసుకుంటే చర్మ సమస్యలకు దూరం చేస్తుంది.
  • కొబ్బరి పాలు నరాల బలహీనత ఉన్నవారు మరియు నరాల నొప్పితో బాధపడే వారు రోజు వారి ఆహారంలో తీసుకుంటే నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.
  • కొబ్బరి పాలు చర్మం కాంతివంతంగా ఉండటానికి మరియు ముందుగా వచ్చే మొహం మీద ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
  • కొబ్బరి పాలు మధుమహన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతాయి అని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. రక్తంలో త్వరగా షుగర్స్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది.
  • కొబ్బరి పాలు ఎముకలలో గుజ్జుని పెంచడానికి ఉపయోగపడుతాయి.
  • కొబ్బరి పాలలో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అవి క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. శరీరం లో క్యాన్సర్ కణాల పెరుగుదల ని నియంత్రిస్తుంది.
  • కొబ్బరి పాలలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి. కొబ్బరి పాలు రోజు ఆహారంలో తీసుకుంటే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చిన వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతాయి అని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
  • కొబ్బరి పాలు మెటబాలిజం ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. కొబ్బరి పాలను రోజు తీసుకోవడం వలన మెటబాలిజం మెరుగుపరుస్తుంది అని న్యూట్రీషన్లు అంటున్నారు.
  • కొబ్బరి పాలు అధిక క్యాలరీలు మరియు ఫ్యాట్ ను కలిగి ఉంటాయి. చాలా మంది బరువు త్వరగా పెరగాలి అని అనుకుంటారు. కాబట్టి ఎవరైతే బరువు త్వరగా పెరగాలని అనుకుంటున్నారో వారికి మంచి ఆహారంగా కొబ్బరి పాలు ఉపయోగపడుతాయి.
    RELATED ARTICLES
    LATEST ARTICLES