Chilgoza dry fruit :
మార్కెట్ లో మనకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ బాదం , పిస్తా , అంజీర మరియు జీడిపప్పు లు ఇలాంటివి మాత్రమే మనకు తెలుసు. కానీ చాలా వరకు మనకు తెలియని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ లో దర్శనమిస్తుంటాయి. డ్రై ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా తినవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని తింటుంటారు. డ్రై ఫ్రూట్స్ లో మీకు తెలియని ఒకటి డ్రై ఫ్రూట్ ఉంది. అదేంటో తెలుసా చిల్గోజా డ్రై ఫ్రూట్ ( chilgoza dry fruit ). చిల్గోజా డ్రై ఫ్రూట్ చాలా మందికి తెలియదు. అంతేకాదు ఈ చిల్గోజా డ్రై ఫ్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ చిల్గొజా గింజలు ( chilgoza dry fruit ) గోధుమ రంగు లో ఉంటాయి మరియు చిల్గొజా గింజలు 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. చిల్గొజా గింజలు తీయటి రుచిని కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి గోధుమ రంగులో ఉన్న , ఎండకి ఎండబెట్టడం వల్ల నలుపు రంగులో కి మారుతాయి. చిల్గొజా గింజల పైన పొట్టు తీస్తే లోపలి భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ చిల్గొజా గింజల్లో చాలా పోషక విలువలు ఉంటాయి.
చిల్గోజా గింజలను ఎక్కువగా భారతదేశం, పాకిస్తాన్ మరియు అఘ్పనిస్తాన్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. చిల్గొజా గింజల్ని పచ్చిగా లేదా పొడిగా మరియు సలాడ్ రూపంలో తీసుకుంటారు. చిల్గొజా గింజల్ని ఎక్కువగా పూర్వ కాలం నుంచి ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు.
చిల్గొజా గింజల్లో పోషక విలువలు : Neutrients values in chilgoza dry fruit
చిల్గొజా గింజల్లో మన శరీరానికి కావల్సిన విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. చిల్గొజా గింజల్లో విటమిన్ సి, విటమిన్ బి 1 ,విటమిన్ బి 2 , పొటాషియం , ఫాస్పరస్ , ఇనుము, కాల్షియమ్, మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు చిల్గొజా గింజల్లో పుష్కళంగా వుంటాయి. చిల్గొజా గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు , ఖనిజాలు శరీరానికి కావల్సిన అన్ని విటమిన్స్ మరియు మినిరల్స్ దీనిలో ఉంటాయి.
Health Benefits of Chilgoza dry fruit :
చిల్గోజా గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
1.చిల్గోజా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు ని మెరుగుపరచడం ఏ కాకుండా మెదడు కణాలను అభివృధి చేయడంలో సహాయపడతాయి.
2.పైన్ గింజల్లో ( pine nuts ) ల్యూటిన్ అనే కేరోటినాయిడ్ ఉంటుంది. ఇది మన కంటి చూపు మెరుగు పరచడానికి దోహదం చేస్తుంది.
3.పైన్ గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కిలిసిస్టోకైనిన్ అనే ఎంజైమ్ ని విడుదల చేస్తాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు.
4.చిల్గొజా గింజల్లో విటమిన్ K ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
5.చిల్గొజా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కడుపులో ఉండే సహజ మైక్రోఫ్లోరా పెరుగుదల కి ఉపయోగపడుతుంది.
6.చిల్గొజా గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది. ఎందుకంటె చిల్గొజా గింజల్లో విటమిన్ K, విటమిన్ E, మెగ్నిషియం, మాంగనీస్ మరియు మోనోఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.