HomeHealthAbc juice recipe : abc juice తయారు చేసే విధానం

Abc juice recipe : abc juice తయారు చేసే విధానం

abc juice recipe :

Abc juice recipe ని చాలా సులభంగా మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఏబిసి జ్యూస్ తయారు చేయడానికి ముఖ్యంగా మనకు మూడు పదార్థాలు కావాలి. అవి ఏమిటంటే బీట్రూట్ , ఆపిల్ మరియు క్యారెట్. ఈ మూడింటితో మాత్రమే ఏబిసి జ్యూస్ లో ని తయారు చేస్తారు. ఉదయం పూట లేవగానే ఈ జ్యూస్ తాగడం చాలా మంచిది. ఈ జ్యూస్ ని పడిగడుపున త్రాగడం వల్ల మన శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.

రోజు ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ లు సైతం రోజు కి ఒక ఆపిల్ తినమని చెబుతుంటారు. ఎందుకంటే ఆపిల్ లో చాలా పోషకాలు ఉంటాయి. అవి మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ కూడా అవసరం ఉండదు అని చెబుతుంటారు. ఆపిల్ పండులో విటమిన్ ఎ , విటమిన్ B1 , విటమిన్ B2 , విటమిన్ B6, విటమిన్ E మరియు విటమిన్ C , విటమిన్ K, ఫోలేట్, నియాసిన్, జింక్ , పొటాషియం , మాంగనీస్, పాస్పరస్ , భాస్వరం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్స్ జీర్ణ క్రియ రేటు ని పెంచుతుంది.

బీట్ రూట్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్ రూట్ లో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి మేలు చేస్తుంది. బీట్రూట్ లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు లైకోపిన్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారు , చర్మం నిగారింపు కోసం ఈ బీట్రూట్ జ్యూస్ ని బాగా తాగుతారు. అంతేకాకుండా రక్తంలో చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది.

భూమి లోపలో పెరిగే వెజిటబుల్స్ తినడం ఎంతో మంచిది. క్యారెట్ ని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే క్యారెట్ తినడం చాలా మంచిది. క్యారెట్ లో ఫోలేట్, నియాసిన్, సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం , భాస్వరం, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ తినడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ లని బయటకి పంపిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ని కరిగిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

ఈ జ్యూస్ ని ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను.

Abc juice recipe తయారు చేసే విధానం :

ఈ జ్యూస్ కి కావల్సిన పదార్థాలు :

1.ఒక ఆపిల్ ( 1 apple )
2.రెండు చిన్న క్యారెట్ లు ( 2 small carrots )
3.ఒక బీట్రూట్ ( 1 beetroot )

Abc juice recipe :

  • abc జ్యూస్ కి కావల్సిన బీట్రూట్, ఆపిల్ మరియు క్యారెట్ ని బాగా నీళ్లలో కడగాలి.
  • వీటిని బాగా నీళ్లలో కడిగిన తర్వాత వాటి పై ఉన్న చర్మాన్ని తీయండి.
  • ఆ తర్వాత చర్మాన్ని తీసిన క్యారెట్ , బీట్రూట్ మరియు ఆపిల్ ముక్కలని గ్రైండర్ లో వేసి , కాసిన్ని నీళ్ళు పోసి బాగా రుబ్బాలి.
  • గ్రైండర్ లో వేసి రుబ్బిన ఈ జ్యూస్ ని వడబోయాలి.
  • వడబోసిన జ్యూస్ ని ఒక గ్లాస్ లో తీసుకోవాలి. దానికి కొంచెం నిమ్మ రసం కలపాలి.
  • స్పూన్ తో బాగా కలిపి తాగండి. ఇలా తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
RELATED ARTICLES
LATEST ARTICLES