Police case filed on famous singer rahul sipligunj in vishakapatnam :
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ( rahul sipligunj ) అంటే బహుశా తెలియని ఉండరేమో…! టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా లో ఒక పాడటం ద్వారా రాహుల్ కి మరింత పేరు వచ్చింది.. ఇప్పుడు తన ఒక వివాదం లో ఇరుక్కున్నారు. ఒక అమ్మాయి రాహుల్ సిప్లిగంజ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఒక మహిళ తన పై రాహుల్ సిప్లిగంజ్ బెదిరింపులకు పాల్పడ్డాడని సదరు యువతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ యువతి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బాధిత మహిళ పిర్యాదు చేసిన మేరకు రాహుల్ సిప్లిగంజ్ పై ( rahul sipligunj ) పలు సెక్షన్ ల పై విశాఖలోని ఎంవిపి కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు లో రాహుల్ సిప్లిగంజ్ పై ఏ కాకుండా 11 మందిపై కేసు నమోదు అయినట్టు సమాచారం. రాహుల్ రెడ్డి బంధువు నీ అంటూ రాహుల్ సిప్లిగంజ్ అమ్మాయిని పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని సదరు యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తన వీడియో లు మరియు ఫోటో లు షేర్ చేస్తామని వేధించారని యువతి కంప్లైంట్ లో పేర్కొంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








