HomeHealthTippa teega : తిప్ప తీగ యెక్క ఉపయోగాలు

Tippa teega : తిప్ప తీగ యెక్క ఉపయోగాలు

Tippa teega : తిప్ప తీగ గురించి చాలా అనేక లాభాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. తిప్ప తీగని ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారీకి ఎక్కువగా వాడుతారు. సిటీలో పెరిగే వారికి ఈ మొక్క గురించి అంతగా తెలియదు కానీ పల్లెటూరులో పెరిగే వారికి దీని ఉపయోగాలు చాలా తెలుసు.

ఈ మొక్క ఎక్కువగా పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ తిప్ప తీగని ఆంగ్లంలో గిలోయ్ అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఈ తిప్ప తీగ పచ్చి ఆకులను రసం చేసి జ్యూస్ గా తీసుకోవచ్చు మరియు పొడి చేసి కాప్సుల్ రూపం లో కూడా తీసుకోవచ్చు.

తిప్ప తీగ ( tippa teega)

Tippa teega తిప్ప తీగ యొక్క ఉపయోగాలు :

1.తిప్ప తీగ ని మదుమేహం ఉన్నవాళ్లు రోజు ఉదయం పడిగడుపున తీసుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. తిప్ప తీగను అనేక వ్యాధులను నయం చేయడానికి వాడుతారు.

2.తిప్ప తీగ లో ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారిన పడకుండా చూస్తుంది.

3.అజీర్తి సమస్య తో బాధపడేవారు తిప్ప తీగ ను తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పొడి బెల్లం తో తిప్ప తీగను కలిపి తీసుకుంటే అజీర్తి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

4.తిప్ప తీగను మధు మేహం వ్యాధి ఉన్నవారు రోజు తీసుకుంటే చక్కెర స్థాయి అదుపులో కి వస్తుంది. ఇది హైపోగ్లైసేమిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

5.తిప్ప తీగ లో కీళ్ల వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయి. కీళ్ల వ్యాధులతో బాధపడేవారు రోజూ ఉదయము తిప్ప తీగ జ్యూస్ ని తీసుకోవటం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

6.తిప్ప తీగను బాగా నూరి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే మొహం పై ఉన్న మొటిమలు పోతాయి.అంతేకాకుండా మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది. మొహం పై ముడతలు కూడా నయం చేస్తుంది.

7.దగ్గు, జలుబు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపుతున్నవారు తిప్ప తీగ జూస్ ను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

8.మానసిక ఒత్తిడి మరియు ఆందోళన తో బాధ పడేవారు తిప్ప తీగ ని తీసుకుంటే మానసిక ఒత్తిడి ని తగ్గించవచ్చు.

9.మతి మరుపు వ్యాధి లక్షణాలు ఉన్నవారు రోజు ఉదయం తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

10.తిప్ప తీగను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని ఒక అపోహ ఉంది. తిప్ప తీగను తీసుకోవడం వల్ల కాలేయానికి హాని చేస్తుందని కొందరు చెబుతుంటారు కానీ తిప్ప తీగను తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదు అని డాక్టర్లు చెబతున్నారు.

11.తిప్ప తీగను గర్భిణీ స్త్రీలు లేదా పాలు ఇచ్చే తల్లులు తిప్ప తీగను తీసుకోవద్దు అని డాక్టర్లు సూచిస్తున్నారు.

12.కంటి చూపుతో, అధిక జ్వరం, టైఫాయిడ్ జ్వరం, డెంగ్ జ్వరం వ్యాధులను నయం చేస్తుంది.

ఇది కూడా చదవండి: రోజు వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు

RELATED ARTICLES
LATEST ARTICLES