Surmai fish :
సుర్మై ఫిష్ భారతదేశం లో ప్రసిద్ధి చెందిన సముద్రపు చేపలలో ఒకటి. సుర్మై ఫిష్ సముద్రాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ సుర్మై చేపని కింగ్ ఫిష్ ( king fish ) అని కూడా పిలుస్తారు. సుర్మై చేప స్క్రాంబిడే కుటుంబానికి చెందిన చేప. సుర్మై చేప మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ స్క్రాంబిడే కుటుంబంలో బోనిటో , కత్తి చేప మరియు ట్యునా కూడా ఉన్నాయి. ఈ స్క్రాంబిడే కుటుంబంలో సముద్రంలో ప్రయాణించే 30 కి పైగా చేపలు ఉన్నాయి.
ఈ సుర్మై చేప ఎక్కువగా హిందూ మహా సముద్రం మరియు ఫసిఫిక్ మహా సముద్రం లభిస్తాయి. అంతేకాకుండా ఈ చేపలు ఎక్కువగా సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తాయి. ఈ సుర్మై చేపలు సముద్రంలో ఎక్కువగా వేగం తో ఈదగలవు. సుర్మై చేపలు ఒక సెకన్ కి దాదాపుగా 5 మీటర్ల వేగంతో ఈదగలవు. ఈ చేపలు ఎక్కువగా తీర ప్రాంతం కి వలస వెళుతుంటాయి.
సుర్మై చేపని ఆంగ్లంలో ” సీర్ ఫిష్ ” అని పిలుస్తారు surmai fish in English . సుర్మై చేపని తెలుగులో వంజరం అని పిలుస్తారు surmai fish in telugu . సుర్మై చేపని మలయాళం లో నేమీన్ లేదా అయాకూర అనే పేరుతో పిలుస్తారు surmai fish in Malayalam . సుర్మై చేపని కన్నడలో అంజల్ అనే పేరుతో పిలుస్తారు సుర్మై fish in kannada . సుర్మై చేపని తమిళంలో వంజిరామ్ మీన్ లేదా వాంచిరామ్ మీన్ అని పిలుస్తారు సుర్మై fish in tamil . సుర్మై చేపని బెంగాలీలో సుర్మా అని పిలుస్తారు surmai fish in Bengali .
Surmai fish price : సుర్మై చేపకి ( king fish ) మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. సుర్మై చేప తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ చేపలను ఎక్కువగా తింటారు. భారత దేశం లో ఈ చేప కిలో ధర 300 రూపాయల నుంచి 400 రూపాయల ధర పలుకుతుంది.
Neutrients values in surmai fish : సుర్మై చేపలో ( vanjaram ) పోషక పదార్థాలు
సుర్మై చేపలో మన శరీరానికి కావల్సిన పోషకాలు పదార్ధాలు అన్ని ఉంటాయి. సుర్మై చేపలో కేలరీలు, ప్రొటీన్లు , కాల్షియమ్, మెగ్నీషియం , పొటాషియం , సోడియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా సుర్మై చేపలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
సుర్మై చేప యొక్క ఉపయోగాలు : surmai fish benefits
1.సుర్మై చేప లో కాల్షియమ్ ఉంటుంది. కాల్షియమ్ మన శరీరములో ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
2.సుర్మై చేప రక్తంలోని చెడు కొలెస్టరాల్ తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండెని పదిలంగా ఉంచుతుంది.
3.సుర్మై చేపని తింటే శరీరం లో అధిక రక్తపోటు ని నియంత్రణలో ఉంచుతుంది.
4.సుర్మై చేపలలోని ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫర సక్రమంగా జరిగేలా చూస్తుంది.
5.సుర్మై చేపలలో ఉండే మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
6.సుర్మై చేపలలో జింక్ ఉంటుంది. ఇది జుట్టు రాలిపోయే సమస్యను తగ్గిస్తుంది.అంతేకాకుండా తలలో చుండ్రును కూడా తగ్గిస్తుంది.
7.సుర్మై చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరములో ఉండే చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త నాళాల్లో రక్తం సాఫీగా జరిగేలా చేస్తుంది.
8.సుర్మై చేపలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మరియు కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.
9.సుర్మై చేపలలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు ని మెరుగుపరుస్తాయి.
10.రోజు డైట్ లో సుర్మై చేపని తీసుకుంటే బరువుని తగ్గిస్తుంది.