Stree 2 movie in Amazon prime video :
స్ర్తీ 2 సినిమా ( stree 2 movie in Amazon prime video ) రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను కలెక్ట్ చేసిన విషయం అందరికి తెల్సిందే. మొదటి పార్ట్ స్ర్తీ సినిమా కంటే రెండవ పార్ట్ ఎక్కువ వసూళ్లను రాబట్టింది. మొదటి పార్ట్ స్ర్తీ సినిమా 2018 వ సంవత్సరం లో రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టింది. ఈ హరర్ చిత్రాన్ని అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ కథానాయికగా మరియు హీరో గా రాజ్ కుమార్ రావు నటించారు.
పార్ట్ 1 హిట్ అయిన తర్వాత ఈ రెస్పాన్స్ చూసి , పార్ట్ 2 ప్లాన్ చేసారు. స్ర్తీ పార్ట్ 2 ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రిలీజ్ అయింది. దాదాపుగా 800 కోట్లకు పై గా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఈ సంవత్సరం బాలీవుడ్ లో అధిక వసూళ్లు రాబట్టిన సినిమాలో ఇది ఒకటి. దర్శకుడు ఈ సినిమాని హరర్ మరియు కామెడీ మిక్స్డ్ చిత్రంగా తెరకెక్కించాడు. అంచనాలకు మరి మించి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
స్ర్తీ మొదటి పార్ట్ ను చిత్ర యూనిట్ డిస్నీ ప్లస్ హాట్స్టర్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ట్రెండింగ్ గా మారింది. చాలా ఎక్కువ మంది ఈ సినిమాని ఆన్లైన్ లో వీక్షించారు. ఇప్పుడు స్ర్తీ 2 సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ( stree 2 movie in Amazon prime video ) దక్కించుకుంది. ప్రస్తుతం స్ర్తీ 2 సినిమా ఓటిటి లో అద్దె రూపంలో అందుబాటులో ఉంది. కొన్ని రోజుల వరకు రెంటల్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్కైబర్స్ అందరు వీక్షించవచ్చు.