HomeHealthStar fruit : స్టార్ ఫ్రూట్ తో బోలెడు ప్రయోజనాలు

Star fruit : స్టార్ ఫ్రూట్ తో బోలెడు ప్రయోజనాలు

Star fruit :

స్టార్ ఫ్రూట్ ( star fruit ) అచ్చం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ ఎక్కువగా వేసవిలో లభిస్తుంది. స్టార్ ఫ్రూట్ ఎక్కువగా మార్కెట్ లో వేసవిలో లభిస్తుంది. ఈ కాయల ఆకృతి స్టార్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి స్టార్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. స్టార్ ఫ్రూట్ పచ్చివి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పచ్చ రంగులో ఉన్నపుడు తింటే కొంచెం పుల్లగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్ పసుపు రంగులో ఉన్నపుడు తింటే తీయ్యగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఈ పండ్లని కారంబోలా అని కూడా పిలుస్తారు.

స్టార్ ఫ్రూట్ ని ( star fruit plant ) ఎక్కువగా ఆసియా లో , దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లో , చైనా మరియు ఆగ్నేసియాలో ఎక్కువగా పండిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా చైనా దేశం ఈ స్టార్ ఫ్రూట్ ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. ఈ ఫ్రూట్ ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. ఈ చెట్టు 25 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. స్టార్ ఫ్రూట్ యొక్క ఆకులు రాత్రి సమయంలో ముడుచుకుని ఉంటాయి. ఈ చెట్టు ( star fruit tree ) నాటిన అప్పటి నుంచి 3 లేదా నాలుగు సంవత్సరాలు మాత్రమే కాయలు కాస్తాయి. మన దేశంలో కూడా స్టార్ ఫ్రూట్ సాగు ఎక్కువగానే చేస్తున్నారు. స్టార్ ఫ్రూట్ అమ్మకాలు ఇప్పుడు మన దేశం జోరుగా సాగుతోంది.

Neutrients values in star fruit : స్టార్ ఫ్రూట్ లో పోషక విలువలు

స్టార్ ఆకారంలో ఉండే ఈ స్టార్ ప్రూట్ లో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ లో బి9, విటమిన్ సి , విటమిన్ బి 6 , విటమిన్ బి 2 మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా స్టార్ ఫ్రూట్ లో ఫైబర్, పొటాషియం, జింక్ , ఐరన్ , సోడియం , ఫోలేట్ , పాస్పరస్, బీటా కెరోటిన్ కాఫర్ , మెగ్నీషియం మరియు యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Star fruit benefits : స్టార్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు

1.అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది ప్రతి రోజూ వ్యాయామం మరియు డైటింగ్ చేస్తుంటారు.స్టార్ ఫ్రూట్ లో విటమిన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీర బరువు ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

2.స్టార్ ఫ్రూట్ లో పొటాషియం ఉంటుంది. ఇది హై బిపీ ని తగ్గిస్తుంది. బీపీ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

3.స్టార్ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్లు మరియు బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల ని అడ్డుకుంటుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కోలన్ క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది.

4.స్టార్ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ శక్తి పెరుగుతుంది. మలబద్దకం ని నివారిస్తుంది. జీర్ణాశయం లో ఉండే ఆల్సర్స్ ని నయం చేస్తుంది.

5.స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఎ ఉంటుంది. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు స్టార్ ఫ్రూట్ నీ తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.

6.గర్బీని స్త్రీలు ఈ స్టార్ ఫ్రూట్ పండ్లని తినడం చాలా మంచిది. స్టార్ ఫ్రూట్ గర్బీని స్త్రీలు తినడం వల్ల పాలు మంచిగా పడతాయి. గర్భిణీ స్త్రీలలో ఆకలిని పెంచుతుంది.

7.స్టార్ ఫ్రూట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా స్టార్ ఫ్రూట్ తినడం వల్ల కొలెస్టరాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. జలుబు మరియు ఫ్లు జ్వరాలు వంటివి రాకుండా కాపాడుతుంది.

8.స్టార్ ఫ్రూట్ తినడం వల్ల రక్తం లోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ పండును డయాబెటిక్ పేషంట్స్ తినడం చాలా మంచిది.అంతేకాకుండా మూత్ర పిండా ల్లో రాళ్ళని కూడా కరిగిస్తుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES