Harika narayan :
సింగర్ హారిక ( harika narayan divorce rumors ) నిజంగానే విడాకులు తీసుకోబోతుందా ? లేదా ? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా సింగర్ హారిక నారాయన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తన వివాహ మరియు నిశ్చితార్థపు ఫోటోలను తొలగించడంతో హారిక విడాకుల ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
అంతేకాకుండా సింగర్ హారిక నారాయన్ ( harika narayan ) భర్త అయిన పృథ్వీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా హారికతో దిగిన ఒక్క ఫోటో కూడా కనిపించకపోవడం విడాకులు తీసుకుంటున్నారని అనుమానం వచ్చింది. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీళ్ళు ఇద్దరు ఇంకా ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. ఇంకా వేచి చూడాలి ఆఫీసియల్ గా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.

సింగర్ హారిక ( harika narayan ) మరియు పృధ్వీ ఇద్దరు గత ఏడాది మార్చి నెలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా సింగర్ హారిక నారాయణ్ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఏవరూ కూడా ఈ విడాకుల విషయంపై ఇంకా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు.
సింగర్ హారిక నారాయణ్ తన స్వరం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమెకి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళు ఒక్కసారి గా విడాకుల విషయం బయటకు వచ్చే సరికి ఫ్యాన్స్ కొంచం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీలు లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత కొన్ని రోజులు కలసి ఉండడం కొన్ని సంవత్సరాలు అయ్యాక విడిపోవడం చాలా కామన్ అయ్యింది. ప్రేమ పెళ్లి చేసుకుని ప్రస్తుతం కలసి ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.