HomeHealthSabja seeds benefits : సబ్జా గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

Sabja seeds benefits : సబ్జా గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

sabja seeds benefits :

తులసి గింజలు అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా సబ్జా గింజలు అని తెలియదు. ప్రస్తుతం సబ్జా గింజల్ని ( Sabja seeds benefits ) జ్యూస్ ల తయారీలో ఎక్కువగా వాడుతారు. సబ్జా గింజల్ని ఎక్కువగా ఫలుడా తయారీలో ఎక్కువగా వాడుతారు . ఈ కాలంలో ఈ గింజల గురించి తెలియని వారు చాలా తక్కువ అని చెప్పొచ్చు ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు ఎప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగిస్తూ వాటి వల్ల ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి. సబ్జా గింజల్ని పురాతన కాలం నుండే ఉపయోగించే వారని శాస్త్రవేత్తలు పరిశోధనలలో వెల్లడైంది. వీటిని ఎక్కువగా భారత దేశం మరియు చైనా మరియు అమెరికా దేశాలలో పండిస్తున్నారు. వీటి ఉత్పత్తి మార్చి నుండి జూన్ మద్యలో వస్తుంది.

తులసి గింజలలో ( Sabja seeds benefits ) రెండు రకాల గింజలు ఉంటాయి. ఒకటి తియ్యటి తులసి మరొకటి సాధారణ తులసి. తియ్యటి తులసి గింజల ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. సాధారణ తులసిని వైద్య పరంగా ఉపయోగిస్తారు..తులసి గింజలు చూడటానికి నలుపు రంగులో ఉండి చిన్న గా ఉంటాయి. వీటిని పురాతన కాలంలో జలుబు దగ్గు కి వాడేవరంట. సబ్జా గింజలు చూడటానికి అచ్చం నల్ల నువ్వుల వలె ఉంటాయి.కానీ వీటిలో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలు రోజు తీసుకుంటే డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి చక్కటి పలితం ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సబ్జా గింజల తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరీ ఎక్కువగా తీసుకుంటే అతే ప్రమాదం ఉంటుంది. అధికంగా సబ్జా గింజల్ని తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సబ్జా గింజల్ని నానబెట్టి కూడా తినకూడదు.ఎందుకంటే గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.


సబ్జా గింజల ఉపయోగాలు ( Sabja seeds benefits ) :

1.సబ్జా గింజలు ఎవరైతే వొంట్లో వేడిని తగ్గించుకోవడానికి చూస్తున్నారో మరియు వొంట్లో వేడితో బాధ పడుతున్నారో వారికి చాలా బాగా సహాయపడుతుంది. రోజు ఉదయం లేవగానే నీటిలో తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది అని ఈ గింజలలో వేడిని తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

2.సబ్జా గింజలు మలబద్దకం తో బాధపడే వారికి మరియు కడుపులో అసిడిటీ తో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతాయి. వీటిలో తేలికగా కడుపులో కదలికలో ఏర్పరిచే గుణం ఉంది అది మలబద్ధకాన్ని నివారిస్తుంది.

3.సబ్జా గింజల్ని ఇప్పుడు చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి వలన శరీరంలోని కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

4.సబ్జా గింజలను రోజు ఉదయం తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది.

5.సబ్జా గింజలు ( Sabja seeds benefits ) మన శరీరంకి కావలసిన అన్ని మినరల్స్ పుష్కలంగా కలిగి ఉంటాయని వీటిని తరుచూ తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

RELATED ARTICLES
LATEST ARTICLES