Nannari sarbath :
నన్నారి షర్బత్ ( nannari sarbath ) రాయలసీమ లో దొరికే ఒక ప్రత్యేకమైన శీతల పానీయం. ఈ నన్నారి షర్బత్ రాయలసీమ లో కడప జిల్లాలో లభించేది. రాను రాను దీని రుచి కారణంగా కడప జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. దీని రుచి కారణంగా ఇంత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న ఈ మండు వేసవిలో శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరం డీహైడ్రేషన్ భారిన పడే అవకాశం ఉంది. అందుకే వేసవిలో డీహైడ్రేషన్ భారిన పడకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలి లేదా సలాడ్స్ గానీ లేదా షర్బత్ గానీ తీసుకోవాలి.
నన్నారి భారతదేశానికి చెందిన మొక్క. నన్నారి ని అనంతమూల లేదా అనంతవెల్ అని పిలుస్తారు. వేసవి లో ఈ నన్నారి షర్బత్ ని తాగడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడుతారు. నన్నారి ని ఆయుర్వేదం లో పిత్త దోషాలను నివారించడానికి వాడుతారు. నన్నారి కి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. నన్నారి వేరుతో తయారు చేసే ఈ షర్బత్ ని రాయలసీమ వాళ్ళు ఎంతో ఇష్టం గా తాగుతారు. ఈ షర్బత్ ని మీరు ఒక్కసారి తాగితే అస్సలు వదిలిపెట్టరు.
నన్నారి షర్భత్ కి ( nannari sarbath ) కావాల్సిన పదార్థాలు :
1.నన్నారి సిరప్ ( nannari syrup)
2.చల్లటి నీరు ( water ) లేదా ఐస్ క్యూబ్స్ ( ice cubes )
3.నిమ్మరసం ( lemon )
4.సబ్జా గింజలు ( sabja seeds)
నన్నారి షర్బత్ తయారు చేసుకునే విధానం : how to prepare nannari sarbath
1.మొదటగా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో 3 లేదా 4 టీ స్పూన్ల నన్నారి సిరప్ ని పోయాలి.
2.ఈ మిశ్రమానికి ఒక లెమన్ లేదా ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని జోడించాలి.
3.ఆ నీరు పోసి బాగా కలపాలి.
4.ఈ షర్బత్ తయారీకి చల్లటి నీరు ని ఉపయోగించాలి లేదా కొన్ని ఐస్ క్యూబ్స్ గానీ ఉపయోగించాలి. ఈ జ్యూస్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి , ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా కలపాలి. సబ్జా గింజలు కలపడం వల్ల కూడా షర్బత్ మరింత చల్లబడుతుంది.
5.నన్నారి షర్బత్ ని సర్వ్ చేయండి.