Matka teaser :
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా ( matka teaser ) సినిమా టీజర్ ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేశారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ టీజర్ కోసం వెయిట్ చేసారు. ఫైనల్ గా చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ నీ ఈ రోజు విడుదల చేశారు. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయిన హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
వరుణ్ తేజ్ నటిస్తున్న టీజర్ నీ ( matka teaser ) చూస్తుంటే , ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం బాక్ డ్రాప్ గా ఈ కథ నడుస్తుంది. టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది కథ కొంచం డిఫరెంట్ గా ఉండబోతుంది అని, అంతేకాకుండా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి మరియు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

మట్కా టీజర్ ( matka teaser ) మొదలు అవ్వగానే ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా పది పైసలు గురించి మిగిలిన 99 మంది కొట్టుకుంటారు. అనే సాలిడ్ డైలాగ్ వింటుంటే అర్థం అవుతుంది కథ డిఫరెంట్ గా ఉండబోతుందని. ఇది వరకే పలాస చిత్రం ద్వారా కరుణ కుమార్ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఈ మట్కా సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో నవీన్ చంద్ర, కిషోర్, అజయ్ ఘోష్, రవి శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మట్కా సినిమాని డాక్టర్ విజయేంద్ర రెడ్డి మరియు రాజని తాళ్లూరి సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ మరియు ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మట్కా సినిమాని నవంబర్ 14 న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.